తెరపై కామెడీని పంచే కమెడియన్లందరి జీవితాలు సంతోషాలతో నిండి ఉంటాయని అనుకుంటే పొరపాటే. కొన్ని సార్లు తమ జీవితంలో జరిగిన విషాదాలను దిగమింగుకొని తెరపై మనల్ని నవ్వించిన కమెడియన్లు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారిలో కమెడియన్ చలాకీ చంటి కూడా ఉన్నారు. ‘జబర్దస్త్’ షోతో పాపులర్ అయిన చంటి తన జీవితంలో జరిగిన విషాద సంఘటనల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. చిన్నతనంలోనే తల్లితండ్రులిద్దరినీ కోల్పోయి చాలా కష్టపడి పై కొచ్చినట్లు చంటి చెప్పారు.
1987లో తాను నెలల వయసులో ఉండగా తండ్రి చనిపోయాడని.. మరో ఐదేళ్లకు తన తల్లి కళ్లముందే ప్రమాదంలో చనిపోయిందని తెలిపాడు. తమ ఇంట్లో గ్యాస్ లీక్ అవ్వడం వలన పెద్ద ప్రమాదం జరిగి తల్లి చనిపోయిందని.. అప్పటికి తన వయసు కేవలం ఐదేళ్లు మాత్రమేనని చెప్పాడు. ఆ సమయంలో ఏం జరిగిందో కూడా అర్ధం కాలేదని.. కొన్ని రోజులకు తన తల్లి ఇక రాదని తెలిసిందని చంటి వెల్లడించారు. అప్పటినుండి ఎవరైనా స్నేహితుల ఇంటికి వెళ్తే.. అక్కడ వారి కుటుంబ చూసి చాలా బాధగా అనిపించేదనీ.. వెంటనే అక్కడ నుండి బయటకి వచ్చేసేవాడినని చెప్పారు.
ఈ మధ్య తనకు కూతురు పుడితే మూడు గంటల పాటు తనను చూస్తూ ఏడ్చానని.. తన తల్లి తన దగ్గరకి తిరిగి వచ్చిందనే ఫీలింగ్ కలిగిందని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు చంటి. ఇక తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. ‘భీమిలీ కబడ్డీ’ జట్టు సినిమా తనకు మంచి పేరు తీసుకొచ్చిందని.. కానీ తరువాత సినిమా అవకాశాలు రాలేదని.. తన గురించి ఇండస్ట్రీలో చెడుగా ప్రచారాలు చేయడం వలనే అవకాశాలు రాలేదని చెప్పుకొచ్చాడు.
Most Recommended Video
ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!