Chalaki Chanti: చలాకి చంటి తాజా హెల్త్ అప్డేట్… అసలేమైందంటే?

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కమెడియన్ గా ప్రేక్షకులకు పరిచయమైనటువంటి చలాకీ చంటి తన అద్భుతమైన కామెడీ స్కిట్లతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసేవారు.ఇలా పలు బుల్లితెర కార్యక్రమాలలోనూ వెండి తెర సినిమాలలోనూ నటిస్తూ సందడి చేసే చలాకి చంటి బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమంలో కూడా పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్న ఈయన గత కొద్ది రోజుల క్రితం తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తోంది.

ఈనెల 21వ తేదీ చలాకి చంటికి చాతిలో తీవ్రమైన నొప్పి రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు తనని ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు తనకు గుండెపోటు అని నిర్ధారించి వెంటనే తనని ఐసీయూలో ఉంచి గుండెపోటుకు చికిత్స అందిస్తున్నారు. తాజాగా ఈయన హెల్త్ గురించి వైద్యులు అప్డేట్ విడుదల చేశారు.

ఈ క్రమంలోనే చంటిని పరీక్షించిన వైద్యులు తనకు రక్తనాళాలలో కూడికలు ఉన్నాయని అందుకోసమే స్టంట్ కూడా వేసామని వెల్లడించారు.అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని అయితే ఇంకా తనని ఐసీయూలోనే ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలియజేశారు.ఈ విధంగా చంటి అనారోగ్య సమస్యల గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో అభిమానులు తాను క్షేమంగా బయటకు రావాలంటూ కోరుకుంటున్నారు.

ఇలా చలాకి చంటి అనారోగ్యానికి గురయ్యారంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలు పై చంటి కుటుంబ సభ్యులు ఎక్కడ స్పందించలేదు అలాగే తన తోటి కమెడియన్స్ లేదా ఇతర ఆర్టిస్టులు కూడా చలాకి చంటి ఆరోగ్యం పై స్పందించకపోవడంతో ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందని మరికొందరు సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus