Hyper Aadi: ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆది సంపాదించిన ఆస్తి ఎంతో తెలుసా?

  • October 25, 2022 / 08:14 PM IST

బుల్లి తెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాల ద్వారా ఎంతోమంది ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇలా బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా కొనసాగుతున్న వారిలో హైపర్ ఆది ఒకరు.జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన హైపర్ ఆది ఈ కార్యక్రమం ద్వారా ఎంతో ఆదరాభిమానాలు సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంతో ఎంతో గుర్తింపు సంపాదించుకున్న ఆది శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇలా ఇండస్ట్రీలో గుర్తింపు పొందిన హైపర్ ఆది ఒకవైపు వెండితెరపై సినిమాలలో నటిస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాల ద్వారా కూడా తనదైన శైలిలో తన కామెడీ పంచ్ లతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

ఇకపోతే హైపర్ ఆది ఒక్కో స్కిట్ కోసం దాదాపు లక్ష రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఇండస్ట్రీలోకి రాకముందు ఒక చిన్న సొంత ఇంట్లో ఉండే హైపర్ ఆది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత భారీగా డబ్బును పోగు చేసిన్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా హైపర్ ఆది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతితక్కువ సమయంలోనే హైదరాబాద్ లో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారట. హైపర్ ఆది ఇంటి ఖరీదు సుమారు 10 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

ఇల్లు మాత్రమే కాకుండా ఖరీదైన కార్లు కూడా ఆది గ్యారేజ్ లో ఉన్నాయని సమాచారం. ఇకపోతే హైపర్ ఆది ఆస్తులన్నీ కలిపి సుమారు 50 కోట్ల వరకు ఉంటాయని తెలుస్తుంది. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆది పెద్ద మొత్తంలో ఆస్తులను కూడా పెట్టారు. ఇండస్ట్రీలోకి రాకముందు ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆది అప్పులు అవడంతో ఉన్నతన పొలం కాస్త అమ్మి తన అప్పులను తీర్చే ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ కి వచ్చారు.

ఇలా ఒకవైపు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు ఫేస్ బుక్ ద్వారా తన వీడియోలను షేర్ చేస్తూ ఉండేవారు ఇలా తన వీడియోలను చూసిన అదిరే అభి హైపర్ ఆదికి జబర్దస్త్ కార్యక్రమంలో అవకాశం కల్పించారు. ఇక ఈ విషయాన్ని హైపర్ ఆది ఇప్పటికే ఎన్నో మార్లు వెల్లడించిన సంగతి మనకు తెలిసిందే.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus