Comedian Prudhvi Raj : పృథ్వీరాజ్ రాజకీయాలపై షాకింగ్ కామెంట్స్ చేసిన కుమార్తె!

Ad not loaded.

30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ తో ఒక్కసారిగా ఎంతో ఫేమస్ అయ్యారు కమెడియన్ పృథ్వీరాజ్.ఈ డైలాగ్ ద్వారా ఎంతో గుర్తింపు పొందినటువంటి ఈయన ఇండస్ట్రీలో వరుస సినిమాలలో అవకాశాలు అందుకొని కమెడియన్ గా ఎంతో మంచి సక్సెస్ సాధించారు.ఇలా సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా పేరు ప్రఖ్యాతలు పొందిన పృథ్విరాజ్ గత ఎన్నికలలో వైసిపి పార్టీకి మద్దతు తెలిపారు. ఇక వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయనకు ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ గా పదవి అప్పజెప్పారు.

అయితే ఈయన ఫోన్ కాల్ లీక్ అవడంతో పార్టీ తనని సస్పెండ్ చేసింది.ఇలా పార్టీ తనను సస్పెండ్ చేయడంతో తిరిగి అవకాశాల కోసం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పృద్వి వైఎస్ఆర్సిపి పార్టీపై విమర్శలు చేశారు.ఇలా వైసిపి పార్టీపై విమర్శలు చేస్తూ ప్రస్తుతం జనసేనకు మద్దతు నిలుస్తున్నటువంటి ఈయన అడపాదడపా సినిమాలలో నటించడమే కాకుండా డైరెక్టర్గా కూడా మారిపోయారు.ఈ క్రమంలోనే క్రాంతి హీరోగా తన కుమార్తె శ్రీలు హీరోయిన్ గా కొత్త రంగుల ప్రపంచం అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శ్రీలు తన తండ్రి (Prudhvi Raj) గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సినిమాలో నేను తన కూతురుననీ నాకు అవకాశం ఇవ్వలేదని కేవలం ఆ పాత్రకు నేను సరిపోతానన్న ఉద్దేశంతో నాన్న నాకు అవకాశం కల్పించారని తెలిపారు. ఇక నాన్న చేసే పాత్రలు తనకు చాలా ఇష్టమని తరచూ నాన్న చేసిన సినిమాలు చూస్తూ ఉంటానని తెలిపారు. ఇలా సినిమాల పరంగా నాన్న పాత్రలు నాకు నచ్చినప్పటికీ నాన్న రాజకీయాలు మాత్రం తనకు ఏమాత్రం నచ్చవని తెలిపారు.

ఈ రాజకీయాలు వద్దు అని నేను నాన్నకు చెప్పలేను ఎందుకంటే తనకు పాలిటిక్స్ అంటే చాలా ఇష్టం అని తెలిపారు.ఇక నాకు ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత నాన్న ఒకే విషయం చెప్పారు. ఇండస్ట్రీలో అన్న తర్వాత వెనుక ముందు చాలా మంది చాలా మాటలు అంటారు వాటిని ఏమాత్రం పట్టించుకోకూడదని తెలిపారంటూ శ్రీలు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus