Punch Prasad: జగన్ సర్కార్ ప్రమేయంతో ప్రసాద్ సర్జరీ పూర్తి.. రుణపడి ఉంటాను అంటూ ఎమోషనల్!

జబర్దస్త్ కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి పంచ్ ప్రసాద్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే. ఈయనకు రెండు కిడ్నీలు పాడవడంతో ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఇన్ని రోజులు డయాలసిస్ చేయించుకుంటూ వచ్చారు అయితే ఈయన ఆరోగ్యం పూర్తిగా పాడవడంతో వెంటనే తనకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలియజేశారు. ఈ విధంగా సర్జరీ చేయించుకోవాలి అంటే భారీగానే డబ్బు ఖర్చవుతుంది అయితే అంత డబ్బు తన వద్ద లేకపోవడంతో మరొక కమెడియన్ నూకరాజు ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేసారు.

దీంతో భారీగానే విరాళాలు కూడా అందించారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి కూడా లక్ష రూపాయలు ఈయన సర్జరీకి సహాయం చేశారని తెలుస్తోంది. ఈ విధంగా సర్జరీ కోసం భారీగానే డబ్బు ఖర్చు కావడంతో విరాళాలు సేకరించారు. ఈ క్రమంలోనే మంత్రి రోజా ప్రసాద్ ఆరోగ్య విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో స్పందించినటువంటి ఏపీ సర్కార్ ప్రసాద్ సర్జరీకి అవసరమయ్యే నిధులను సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

దీంతో ఈయనకు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిధులు విడుదల కావడంతో హైదరాబాద్ యశోద హాస్పిటల్ లో ఈయనకు సర్జరీ జరిగింది. ఈ విధంగా ప్రసాద్ సర్జరీ విజయవంతం కావడంతో ఈ విషయాన్ని ప్రసాద్ భార్య సునీత సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఈ విధంగా తన భర్తకు సర్జరీ పూర్తి అయిందని ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని త్వరలోనే మీ ముందుకు రాబోతున్నారు అంటూ తెలియచేశారు ఇలా తన కుటుంబానికి అండగా నిలిచిన ఏపీ ప్రభుత్వానికి తామెప్పుడు రుణపడి ఉంటామని (Punch Prasad) ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు అంటూ తెలియజేశారు.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus