Rahul Ramakrishna: అసలు ఏంటి ఈ లొల్లి… అనసూయ వివాదంలో తల దూర్చిన కమెడియన్!

బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్ అనసూయ ప్రస్తుతం విజయ్ దేవరకొండ అభిమానులతో పెద్ద ఎత్తున గొడవకు దిగిన విషయం మనకు తెలిసిందే. విజయ్ దేవరకొండ అభిమానులను ఉద్దేశిస్తూ తరచూ చేసే పోస్టులు తీవ్రస్థాయిలో వివాదాలకు కారణమవుతున్నాయి. గతంలో వీరిద్దరి మధ్య ఇలాంటి వివాదం తలెత్తడంతో అనసూయ ఏకంగా విజయ్ దేవరకొండ అభిమానులపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇక తాజాగా విజయ్ దేవరకొండ పోస్టర్ పైఅనసూయ పరోక్షంగా స్పందిస్తూ ఈ పైత్యం మనకు అంటకుండా చూసుకోవాలి అంటూ కామెంట్ చేశారు.

అయితే ఈమె పరోక్షంగా విజయ్ దేవరకొండను ఉద్దేశించి మాట్లాడారని విజయ్ దేవరకొండ అభిమానులు అనసూయ పై ఓ రేంజ్ లో ఫైర్ అవుతూ తనని ట్రోల్ చేస్తున్నారు. ఇలా అనసూయ విజయ్ దేవరకొండ అభిమానుల మధ్య గొడవ తారస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే విజయ్ అభిమానులను ఉద్దేశిస్తూ అనసూయ తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… నువ్వు నన్ను తిడితే నీ నోరు కంపు అవుతుంది కానీ నేను ఎలా తప్పు అవుతాను? నా పెంపకం ఎంతో గర్వించే విషయం..

నా అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పటం నేర్పించింది.మీ పెంపకం ఎలాంటిదో మీరే అర్థం చేసుకోండి అంటూ ఈమె ఘాటుగా స్పందించారు. ఇలా అనసూయ తరచు సోషల్ మీడియా వేదికగా ఇలాంటి పోస్టులు చేయడంతో కమెడియన్ రాహుల్ రామకృష్ణ ఈ వివాదంలోకి ఎంటర్ అయ్యారు. ఈ సందర్భంగా ఈయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. నేను ఇలా అడుగుతున్నందుకు దయచేసి నన్ను క్షమించండి.

ఇంతకీ ఇక్కడ జరుగుతున్న ఈ లొల్లి ఏంటి కాస్త చెబుతారా అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేయడంతో విజయ్ దేవరకొండ అభిమానులు అనసూయ చేసినటువంటి పోస్టుల గురించి ఆయనకు చెబుతూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి అనసూయ విజయ్ దేవరకొండ అభిమానుల మధ్య మొదలైన ఈ వివాదం ఎప్పటికీ ముగుస్తుందో తెలియాల్సి ఉంది.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus