Rahul Ramakrishna: కమెడియన్ రాహుల్ రామకృష్ణ కొడుకుకి ఎవరి పేరు పెట్టారో తెలుసా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కమెడియన్ రాహుల్ రామకృష్ణ గురించి పరిచయం అవసరం లేదు. ఈ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన అనంతరం తెలుగులో వరుస సినిమా అవకాశాలను అందుకున్నారు. ఈ క్రమంలోనే జాతి రత్నాలు సినిమాతో మరోసారి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు.

అయితే కొన్నిసార్లు ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసే పోస్టులు కాస్త వివాదాలకు కూడా కారణమవుతూ ఉంటాయి. ఇకపోతే కమెడియన్ రాహుల్ రామకృష్ణ గతంలో ఒక అమ్మాయి ఫోటోని షేర్ చేస్తూ తనకు కాబోయే భార్య అంటూ పరిచయం చేశారు. అయితే ఈయన పెళ్లి చేసుకున్నట్లు ఎక్కడ ఎప్పుడు అభిమానులతో పంచుకోలేదు. ఇలా తన పెళ్లి విషయాన్ని దాచిపెట్టిన తన భార్య ప్రెగ్నెంట్ అనే విషయాన్ని అందరితో పంచుకున్నారు.

తన భార్య బేబీ బంప్ ఫోటోని షేర్ చేస్తూ త్వరలోనే తండ్రి కాబోతున్నాననే విషయాన్ని వెల్లడించారు. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా రాహుల్ రామకృష్ణ తనకు కుమారుడు జన్మించినట్లు వెల్లడించారు.ఇలా తనకు బాబు పుట్టిన విషయాన్ని తెలియచేసిన ఈయన ఇప్పటివరకు తన కొడుకు ఫోటోని రివిల్ చేయలేదు. తాజాగా తన భార్య కుమారుడు కలిసి ఉన్న ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన కొడుకును అందరికీ పరిచయం చేశారు.

అలాగే తన (Rahul Ramakrishna) కుమారుడికి రూమీ అనే పేరును పెట్టినట్లు కూడా తెలియజేశారు. ఇలా తన కుమారుడికి పర్షియన్ రైటర్ పేరు పెట్టారని తెలుస్తోంది.ప్రస్తుతం రాహుల్ రామకృష్ణ షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్స్ ఈ ఫోటో పై స్పందిస్తూ తన కుమారుడు చాలా క్యూట్ గా ఉన్నారని కామెంట్ చేయగా మరికొందరు జూనియర్ రాహుల్ రామకృష్ణ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


</ifram

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus