రాహుల్ రామకృష్ణపై నెటిజన్ల ఎటాక్!

ప్రముఖ కమెడియన్ రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. సినిమాల గురించి మాత్రమే కాకుండా.. రాజకీయాలు, వివాదాస్పద అంశాల గురించి కూడా మాట్లాడుతుంటాడు. సినిమాల విషయంలో కూడా డిఫరెంట్ గా కామెంట్స్, పోస్ట్ లు పెడుతుంటాడు. ఈ క్రమంలో తాను ప్రధాన పాత్ర పోషించిన ‘నెట్’ అనే వెబ్ ఫిలిం గురించి రాహుల్ ఒక కామెంట్ చేసింది. ”మా సినిమాకి గు..లో దమ్ముంది” అంటూ రాహుల్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

ఈ పోస్ట్ పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ట్విట్టర్ లో బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని.. యూత్ ను ప్రభావితం చేసే రాహుల్ లాంటి వాళ్లు ఇలా బూతులు మాట్లాడి తప్పుదోవ పట్టించకూడదని కామెంట్స్ చేస్తున్నారు. నెటిజన్లు తనపై ఎటాక్ చేస్తుండడంతో రాహుల్ స్పందించాడు. తన ట్వీట్ మాత్రం డిలీట్ చేయలేదు. తన కామెంట్ పట్ల పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయలేదు. తనపై విమర్శలు చేసిన వాళ్లకు మండేలా మరో ట్వీట్ చేశాడు.

”అంటే ట్విట్టర్లో అందరూ పతిత్తులే అన్నమాట” అని రాహుల్ కామెంట్ చేశాడు. రాహుల్ దమ్మున్న కామెంట్ పెట్టాడని కొందరు నెటిజన్లు ప్రశంసిస్తుంటే.. మరికొందరు మాత్రం మళ్లీ అతడిని ఎటాక్ చేయడం మొదలుపెట్టారు. మొత్తానికి ఈ కామెంట్ తో ‘నెట్’ సినేమానికి మంచి పబ్లిసిటీ అయితే వచ్చింది. మరి ఈ సినిమాకి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి!

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus