మొన్న పునీత్..నిన్న విక్రమ్.. ఇప్పుడు ఇంకో నటుడు..!

విపరీతంగా జిమ్ చేయడం కూడా ఓ చెడ్డ అలవాటు అనే చెప్పాలి.డాక్టర్లు కూడా జిమ్ చేయడానికి బదులుగా యోగా, వాకింగ్ వంటివి చేయమంటుంటారు. సినిమా వాళ్ళు ఫిట్ గా కనిపించడం కోసం తెల్లవారుజామున లేచి అధిక బరువులు ఎత్తుతూ ఉంటారు. రకరకాల భంగిమలు కూడా చేస్తుంటారు. అలాంటి టైంలో ఎంతో మందికి గుండెపోటు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. గత ఏడాది కన్నడ పరిశ్రమకు చెందిన స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ జిమ్ చేస్తుండగానే గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు.

అనంతరం సిబ్బంది హాస్పిటల్ కి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయింది. మొన్నటికి మొన్న విక్రమ్ కూడా జిమ్ చేస్తుండగానే.. అతనికి ఛాతి నొప్పి వచ్చింది. అయితే అదృష్టవశాత్తు విక్రమ్ కు ఎటువంటి హాని కలుగలేదు. తాజాగా మరో నటుడికి కూడా జిమ్ చేస్తుండగా గుండెపోటు వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ప్ర‌ముఖ స్టాండ‌ప్ క‌మెడియ‌న్ అయిన రాజు శ్రీవాస్త‌వ బుధ‌వారం నాడు జిమ్‌ చేస్తుండగా గుండెపోటుకు గురయ్యాడు. జిమ్ లో కఠినమైన వ‌ర్క‌వుట్లు ఈయన చేసినట్టు తెలుస్తుంది.

అటు తర్వాత ట్రెడ్‌మిల్‌ పై వ‌ర్క‌వుట్ చేస్తుండగా ఒక్కసారిగా ఆయనకు గుండె నొప్పి రావ‌డంతో కుప్ప‌కూలినట్టు సమాచారం. వెంటనే కుటుంబ సభ్యులు, సిబ్బంది ఢిల్లీలో ఉన్న ఎయిమ్స్‌ ఆసుపత్రికి త‌ర‌లించ‌గా పెద్ద ప్రమాదం తప్పిందని తెలుస్తుంది. వైద్యులు ట్రీట్మెంట్ ఇచ్చి గుండె తిరిగి బాగా ప‌నిచేసేలా సీపీఆర్ చేశారట. రెండు సార్లు చేయడంతో పరిస్థితి నార్మల్ అయ్యింది అని వారు చెప్పుకొచ్చారు.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus