ఘనంగా సుధాకర్ కొడుకు పెళ్లి.. పెద్ద మనసు చాటుకున్న టాలీవుడ్ స్టార్స్!

కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో విలన్ గా, హీరోగా నటించిన సుధాకర్.. ఆ తర్వాత హీరోగా మారి స్టార్ స్టేటస్ దక్కించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, సుధాకర్, జి.వి.నారాయణ రావు, ప్రసాద్ బాబు వీళ్లంతా బెస్ట్ ఫ్రెండ్స్. అప్పట్లో చిరంజీవి హీరోగా నటించిన అనేక సినిమాల్లో వీళ్లంతా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా చేసేవారు. వీళ్ళను బిజీ ఆర్టిస్ట్ లుగా నిలపడంలో కూడా చిరు సక్సెస్ అయ్యారు. సుధాకర్ అయితే స్టార్ అయ్యారు.

1990 ..ల టైంలో ఈయన కమెడియన్ గా బిజీగా గడిపారు. బ్రహ్మానందం వంటి స్టార్స్ ను కూడా డామినేట్ చేశారు అని చెప్పొచ్చు. తర్వాత కొత్త వాళ్ళు ఎంట్రీ ఇవ్వడంతో పాటు ఈయన ఆరోగ్యం కూడా దెబ్బ తినడంతో సినిమాలకి దూరంగా ఉన్నారు. సుధాకర్ చివరిగా నితిన్ హీరోగా తెరకెక్కిన ‘ద్రోణ’ సినిమాలో కనిపించారు. అలాగే ‘eee ‘ అనే మరో చిత్రంలో కూడా నటించారు. కానీ ఈ సినిమా గురించి ఎక్కువ మందికి తెలిసుండదు.

ఇక సుధాకర్ తన ఏకైక కొడుకు అయిన బెనిడిక్ మైఖేల్ ని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అనుకున్నారు.మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా బెన్నీ ఎంట్రీ ఉంటుందని కూడా సుధాకర్ చెప్పడం జరిగింది. ఇదిలా ఉండగా.. ఇటీవల సుధాకర్ కొడుకు పెళ్లి జరిగింది. జగపతి బాబు, బ్రహ్మానందం, రోజా రమణి, చంద్రబోస్, సుచిత్రా చంద్రబోస్ వంటి వారు ఈ వివాహ వేడుకలో సందడి చేశారు.

బెన్నీ వివాహం క్రిస్టియన్ పద్దతిలో జరిగింది. సుధాకర్ (Sudhakar Betha) ఆరోగ్య పరిస్థితి బాలేదు అందువల్ల ఆయన నడవలేకపోతున్నారు. అయినా టాలీవుడ్ సెలబ్రిటీలు సుధాకర్ కొడుకు పెళ్లిని దగ్గరుండి జరిపించారు. ఇందుకు సంబందించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

యూట్యూబ్లో వందల కొద్దీ మిలియన్ల వ్యూస్ నమోదు చేసిన పాటల లిస్ట్
ఆ విషయంలో నేను బాధ పడలేదు.. ఉపాసన కామెంట్స్ వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus