Sudhakar: నేను హ్యాపినే అంటూ..నటుడు సుధాకర్ విడుదల చేసిన విడియో వైరల్

సోషల్ మీడియా విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏది నిజమైన వార్త, ఏది ఫేక్ న్యూస్ అనేది తెలుసుకోవడం కష్టమైపోయింది. ఇటీవల కాలంలో పలువురు సినీ సెలబ్రిటీలపై తప్పుడు వార్తలను ప్రచారం బాగా ఎక్కువైపోయింది. చాలా కాలంగా తెర మీద కనిపించని సీనియర్ నటీనటులు కొందరు మరణించినట్లుగా రూమర్లు ప్రచారం చేస్తున్నారు. దీంతో సదరు సినీ ప్రముఖులు లైవ్ లోకి వచ్చి, తాము బ్రతికే ఉన్నామని క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పుడు నటుడు సుధాకర్ మీద కూడా అలాంటి ఫేక్ వార్తే వచ్చింది.

టాలీవుడ్ సీనియర్ కమెడియన్ సుధాకర్ మృతి చెందారంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్ అయింది. పలు మీడియా సంస్థలు కూడా నటుడు కన్నుమూశారంటూ అదే వార్తను క్యారీ చేశాయి. ఈ నేపథ్యంలో వాటిని ఖండిస్తూ సుధాకర్ ఓ వీడియోలో మాట్లాడారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. దయచేసి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని కోరారు.

“అందరికీ నమస్కారం. నా మీద వచ్చినవి ఫేక్ న్యూస్. తప్పుడు సమాచారాన్ని నమ్మకండి. అలాంటివి స్ప్రెడ్ చేయకండి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఐ యామ్ వెరీ హ్యాపీ” అని సుధాకర్ వీడియో ద్వారా చెప్పుకొచ్చారు. ఈ విధంగా ఆయన మరణించాడనే వార్తలకు చెక్ పెట్టారు. సుధాకర్ పై ఇలాంటి నకిలీ వార్తలను ప్రచారం చేయడంపై సినీ అభిమానులు మండిపడుతున్నారు. బ్రతికున్న మనిషిని చనిపోయాడని చెప్పడం సరికాదని ఫైర్ అవుతున్నారు.

నిజానికి సుధాకర్ (Sudhakar) ఆరోగ్యం గురించి ఇలాంటి రూమర్స్ రావడం ఇదే ఫస్ట్ టైమ్ ఏమీ కాదు. 2010లో ఆయన తీవ్ర అనారోగ్యం కారణంగా కోమాలోకి వెళ్లారు. ఆ సమయంలోనే సుధాకర్ ఇక లేరని ఫేక్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ సమయంలోనే సుధాకర్ ఇక లేరని ఫేక్ వార్తలు పుట్టించారు. అయితే వైద్యులు మెరుగైన చికిత్స అందించడంతో, 2015 సంవత్సరంలో తిరిగి కోలుకున్నారు. ఆ తర్వాత కూడా తాను సినిమాల్లో నటించబోతున్నట్టు ప్రకటించారు కానీ.. పెద్దగా కనిపించలేదు. ప్రస్తుతం సుధాకర్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus