Commitment Review: కమిట్మెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • August 19, 2022 / 05:55 PM IST

చాలా కాలంగా విడుదలకు పెండింగ్ లో ఉన్న సినిమాల్లో ‘కమిట్మెంట్’ ఒకటి. అడల్ట్ కంటెంట్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడంతో టీజర్ నుండే చర్చలకు దారి తీసింది ఈ సినిమా. ‘బిగ్ బాస్ 2’ కంటెస్టెంట్ లు అయిన తేజస్వి, అమిత్ లతో పాటు ‘గండి బాత్’ అనే వెబ్ సిరీస్ తో పాపులర్ అయ్యి..

ఇటీవల ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలో సీసా అనే ఐటెం సాంగ్ చేసిన అన్వేషి జైన్, సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలతో రెచ్చగొట్టే రమ్య పసుపులేటి వంటి వారు నటించిన చిత్రం కావడంతో అందరిలోనూ ఆసక్తిని పెంచాయి. మరి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి :

కథ : వివిధ రంగాలకు చెందిన నలుగురు యువతులు వారి జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల ఆధారంగా రూపొందిన చిత్రమిది. ఒకరు హీరోయిన్, ఇంకొకరు డాక్టర్, యుక్త వయస్కురాలు, స్టూడెంట్, జూనియర్ డాక్టర్. వీళ్లందరూ ఒక లక్ష్యంతో ముందుకు వెళ్ళాలని భావించేవారు. అయితే వీరి జీవితాల్లోని కొందరు వ్యక్తులు ప్రవేశించి ఓ ముళ్లకంచె వేస్తారు. దానిని దాటుకుని తమ లక్ష్యాన్ని చేరుకున్నారా? లేక ఆ ముళ్ల కంచె వేసిన వారికి దాసోహం అయిపోయారా? అన్నది మిగిలిన కథాంశం.

నటీనటుల పనితీరు : తేజస్వి మదివాడ ,అన్వేషి జైన్, రమ్య పసుపులేటి… వీళ్ళవే ప్రధాన పాత్రలు కాబట్టి ముందుగా వీరి గురించే చెప్పుకోవాలి.వీళ్ళ ముగ్గురికీ అలవాటైన స్కిన్ షో, ఇంటిమెంట్ సీన్లలో నటించడానికి వీళ్ళు పెద్దగా ఇబ్బంది పడలేదు అంటే తమ పాత్రలను అంత బాగా ఓన్ చేసుకున్నారని స్పష్టమవుతుంది.శృంగార సన్నివేశాలు, లిప్ లాక్ లు అనే కాకుండా ఈ కథలో మంచి మెసేజ్ ఉంది.

ఇలాంటి పాత్రలు చేయడానికి ఎవ్వరూ ధైర్యం చేయరు కాబట్టి.. ఈ ముగ్గురినీ అభినందించాల్సిందే. ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా ఈ ముగ్గురు బాగా చేశారు. అమిత్ తివారీ, రాజా రవీంద్ర వంటి వారు కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణుల పనితీరు : ‘పరిచయం’ ‘నిన్న నేడు రేపు’ వంటి చిత్రాలను తెరకెక్కించిన లక్ష్మీ కాంత్ చెన్నా.. ఈసారి మంచి పాయింట్ తో ‘కమిట్మెంట్’ ను తెరకెక్కించాడు. అందుకు తగ్గ నటీనటులను ఎంపిక చేసుకోవడంలో కూడా అతను సక్సెస్ అయ్యాడు. మెసేజ్ తో పాటు ఎమోషనల్ కనెక్టివిటీకి కూడా ఎక్కువ స్కోప్ ఉన్న కథ ఇది. ఎమోషనల్ కనెక్టివిటీ లోపించింది అంటే కథ ప్రేక్షకులకు చేరదు. ‘కమిట్మెంట్’ విషయంలో కూడా అదే జరిగింది. నటీనటుల ఎమోషనల్ సీన్స్ లో తమ ఎఫర్ట్ పెట్టారు.

కానీ అవి డిజైన్ తీరు వలనో లేక ప్లేస్మెంట్ వలనో కానీ సైడ్ ట్రాక్ కు వెళ్లిపోయిన ఫీలింగ్ కలుగుతుంది.నరేష్ కుమారన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపిస్తుంది కానీ పాటలు అంతగా రిజిస్టర్ కావు. నిర్మాణ విలువలు ఓకే. కానీ ఇలాంటి సినిమాలకు రన్ టైం ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. కానీ అది కూడా పరిమితులు దాటేయడం మైనస్ పాయింట్ గా చెప్పుకోవాలి.

విశ్లేషణ : పూర్తిగా యూత్ ను, ‘మీటూ’ ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా ఇది. మంచి మెసేజ్ ఉంది కానీ బోల్డ్ సన్నివేశాలకే పెద్ద పీట వేశారు. అయితే రన్ టైం రెండు గంటల నలభై నిమిషాలు ఉండడం వలన కోర్ ఆడియన్స్ ను మెప్పించకపోవచ్చు.

రేటింగ్ : 2/5

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus