టాలీవుడ్ ఇండస్ట్రీలో వైజయంతీ మూవీస్ బ్యానర్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ బ్యానర్ ద్వారా అశ్వనీదత్ నిర్మించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఘనవిజయం సాధించాయి. ఈ బ్యానర్ లో దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాళ్ ఠాకూర్, రష్మిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సీతారామం మూవీ త్వరలో థియేటర్లలో రిలీజ్ కానుంది. 45 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిందని సమాచారం అందుతోంది. 11 సంవత్సరాల క్రితం ఈ బ్యానర్ లో తెరకెక్కిన శక్తి సినిమా కూడా 45 కోట్ల రూపాయల బడ్జెట్ తోనే తెరకెక్కింది.
మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన శక్తి సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసోలేదనే సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు ఇంగ్లీష్ లో ఎస్ తో స్టార్ట్ కావడం గమనార్హం. అయితే సీతారామం శక్తి సినిమాలా కాకుండా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అశ్వనీదత్ కు సీతారామం నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా భారీ మొత్తంలో ఆదాయం దక్కిందని తెలుస్తోంది.
నాన్ థియేట్రికల్ హక్కులు ఏకంగా 25 కోట్ల రూపాయలకు అమ్ముడవడంతో థియేట్రికల్ హక్కుల ద్వారా 20 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లు రావాల్సి ఉంది. హను రాఘవపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ఆయన అభిమానులు ఈ సినిమా రిజల్ట్ విషయంలో ఆయన కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.
పడి పడి లేచే మనసు సినిమా తర్వాత హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఇదే కావడం గమనార్హం. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమా రిలీజవుతోంది. క్లాస్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.
Most Recommended Video
ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!