రవితేజ, శర్వానంద్ ల సినిమాల్లో ఈ కామన్ పాయింట్ గమనించారా?

రవితేజ , శర్వానంద్ ఇద్దరూ మిడ్ రేంజ్ హీరోలే. కానీ ఆ మిడ్ రేంజ్ హీరోల్లో టాప్ ఆర్డర్ లో రవితేజ ఉంటారు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ ఇద్దరు హీరోలు యాదృచ్ఛికంగా ఒకే కథతో సినిమాలు చేశారు. ఇలా ఒకే కథతో రెండు సినిమాలు రావడం కొత్తేమీ కాదు. పరిచూరి చెప్పినట్టు… దేవదాసు, అర్జున్ రెడ్డి కథలు ఒక్కటే. కానీ ట్రీట్మెంట్ వేరు. అలాగే మొన్నామధ్య వచ్చిన పటాస్, టెంపర్ కథలు కూడా ఒకటే కానీ ట్రీట్మెంట్ వేరు అవి కూడా సక్సెస్ అయ్యాయి.

కొత్త కథలు రావడం .. దొరకడం కష్టమే. ప్రేక్షకులు కూడా కొత్తదనం కోరుకోవడం తగ్గించారు. పాత కథే అయినా కొత్త ఫార్మెట్ లో ఎంగేజింగ్ .. గా చెబితే సక్సెస్ ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు. సరే ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం. శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రణరంగం అనే సినిమా వచ్చింది. 2019 లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోయింది. ఈ సినిమా కథ విషయానికి వస్టే … శర్వానంద్ ఒక డాన్.

అతను గతంలో ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తుంటాడు.కానీ బాగా సంపాదిస్తాడు. అదే సమయంలో హీరోయిన్ ను ప్రేమిస్తాడు. పెళ్ళి చేసుకుని ఓ బిడ్డకు జన్మనిస్తాడు. కానీ హీరో శత్రువులు ఆమెను చంపేస్తారు. క్లైమాక్స్ లో ఆ ఘోరం చేసేది ఇతని ఫ్రెండ్ అనేది ఒక ట్విస్ట్. ఇక రవితేజ కూడా ఇలాంటి కథతో డిస్కో రాజా అనే సినిమా చేశాడు. కాకపోతే దీనికి కొంచెం సైంటిఫిక్ టచ్ ఉంటుంది. కానీ ఫ్లాష్ బ్యాక్ సేమ్.

హీరో .. హీరోయిన్ ను ప్రేమించడం.. మరోపక్క డాన్ గా ఎదగడం.. ఆ టైంలో హీరోయిన్ చంపబడడం.ఈ కథలో కూడా హీరో ఫ్రెండ్ విలన్ అని క్లైమాక్స్ లో తెలుస్తుంది.రెండు సినిమాల్లోనూ కథనం నీరసంగా ఉంటుంది. అందుకే ఫలితాలు కూడా సేమ్. రెండూ డిజాస్టర్ లే..!

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus