Mega 157: చిరంజీవికి 157 అచ్చి రావడం లేదా? ఎందుకిలా జరుగుతోంది?

చిరంజీవి (Chiranjeevi) సినిమాల ఆర్డర్‌ మీద చాలా డౌట్స్‌ ఉన్నాయి. ఎందుకంటే తన 150వ సినిమాగా ‘ఖైదీ నెం 150’ను అనౌన్స్‌ చేశారు. అయితే 150వ సినిమా అవ్వదు.. లెక్కలు తప్పేశారు అని అప్పట్లో వార్తలొచ్చాయి. ఆ తర్వాత అవన్నీ వదిలేయండి.. ఇక్కడి నుండే కంటిన్యూ చేద్దాం అని అనుకున్నారంతా. అనుకున్నట్లుగానే చేస్తున్నారు కూడా. అయితే 157 నెంబరు వచ్చినప్పటి నుండి ఏదో సమస్య మొదలైంది. ఎందుకంటే ఈ నెంబరులో అనుకున్న సినిమాలు, ప్రాజెక్టులు ఇబ్బంది పడుతున్నాయి.

Mega 157:

అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో చిరంజీవి నటించబోతున్న సినిమాకు తాజాగా 157 నెంబరు కేటాయించారు. దీంతో మరోసారి 157 నెంబరు గురించి చర్చ మొదలైంది. దీంతో చిరంజీవి లైనప్‌, అందులో ఆ నెంబరు సినిమా ఏంటి అని చూసే ప్రయత్నం చేస్తే.. ఆసక్తికర అంశాలు కొన్ని బయటికొచ్చాయి. లెక్కల ప్రకారం చూస్తే డిజాస్టర్‌ ‘భోళా శంకర్’ (Bhola Shankar)  చిరంజీవికి 155వ సినిమా. ఆ సినిమా సెట్స్‌ మీద ఉండగానే చిరంజీవి వరుస సినిమాలు అనౌన్స్‌ చేశారు. అలా కల్యాణ్‌ కృష్ణ సినిమా 156వ సినిమా అయింది.

ఆ వెంటనే వెంకీ కుడుముల  (Venky Kudumula)  – డీవీవీ దానయ్య సినిమాను అనౌన్స్‌ చేశారు. ఆ సినిమాకు అప్పట్లో 157 నెంబరు ఇచ్చారు. కానీ వివిధ కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ఆలోచన ముందుకెళ్లలేదు. ఈ లోపు ‘బింబిసార’ (Bimbisara) వశిష్ట (Mallidi Vasishta) వచ్చారు. ఆయన చెప్పిన ‘విశ్వంభర’ (Vishwambhara) సినిమా కథ ఓకే అవ్వడంతో దానికి ఆ 157 నెంబరు ఇచ్చేశారు. సినిమా ప్రారంభం అనగానే దానికి 156 నెంబరు ఇచ్చేశారు. దానికి కారనం కల్యాణ్‌ కృష్ణ సినిమా ఆలోచన ఆగిపోవడమే.

దాంతో 157 నెంబరు ఖాళీ అయిపోయింది. ఈ ప్లేస్‌లోకి రావడానికి చాలా ప్రాజెక్ట్‌లు, చాలామంది దర్శకులు ముందుకొచ్చారు. వారిలో హరీశ్‌ శంకర్‌ (Harish Shankar), పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh), వీవీ వినాయక్‌ (V. V. Vinayak), మోహన్‌ రాజా (Mohan Raja) ఉన్నారు. వాళ్లెవరికీ ఆ ఛాన్స్‌ రాలేదు. ఈ లోపు శ్రీకాంత్‌ ఓదెల (Srikanth Odela) సినిమా అనౌన్స్‌ చేశారు. దానికి ఆ నెంబరు ఇచ్చేశారేమో అనుకున్నారంతా. అయితే అది 158 అని, అనిల్‌ రావిపూడి సినిమా 157 అని తేలింది. ఇలా ఇన్ని మార్పులకు లోనై ఆ సినిమా ఆదివారం స్టార్టయింది.

ఇక్కడో విషయం ఏంటంటే.. కొన్ని రోజులు 157 నెంబరు పెట్టుకున్న ‘విశ్వంభర’ నానా ఇబ్బందులు పడుతూ ఇంకా రిలీజ్‌ డేట్‌ విషయంలో ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. అంటే 157 విషయంలో ఏదో ఇబ్బంది ఉంది అని చెప్పొచ్చు.

‘పద్మభూషణ్‌’ అవార్డు గురించి బాలకృష్ణ రియాక్షన్‌.. ఇప్పుడెందుకు మాట్లాడినట్లో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus