Chiranjeevi, Ram Charan: ‘ఆచార్య’ ట్రైలర్‌లో ఈ కన్‌ప్యూజన్‌ ఏంటి?

‘ఆచార్య’ ట్రైలర్‌ వచ్చింది చూశారా? చూసే ఉంటారు లెండి. ఆ సినిమాలో హీరో ఎవరు, గెస్ట్‌ రోల్‌ ఎవరు? అనే డౌట్‌ వచ్చిందా? మీరు ఎంతటి మెగా ఫ్యామిలీ అభిమాని అయినా ఈ డౌట్‌ అయితే పక్కాగా వస్తుంది. ఎందుకంటే ట్రైలర్‌ కట్‌ అలా ఉంది మరి. ఇప్పటివరకు చిత్రబృందం బయటకు చెప్పిన విషయాల ప్రకారం చూస్తే… సినిమాలో చిరంజీవి హీరో, రామ్‌చరణ్‌ గెస్ట్‌ పాత్ర. ఇంకా చెప్పాలంటే ఎక్స్‌టెండెడ్‌ గెస్ట్‌ పాత్ర. కానీ ట్రైలర్‌ మాత్రం అలా లేదు.

Click Here To Watch Trailer

‘ఆచార్య’ టీజర్‌ ప్రకారం చూస్తే… చిరంజీవిని ఎక్కువగా చూపించి, రామ్‌చరణ్‌ను తక్కువగా చూపించారు. చిరంజీవినే హీరో కాబట్టి.. అలానే ఉంటుంది. అయితే ట్రైలర్‌ దగ్గరకొచ్చేసరికి సీన్‌ రివర్స్‌ అయ్యింది. ‘ఆర్ఆర్ఆర్‌’ చరణ్‌ వేడిని యూజ్‌ చేసుకునే క్రమంలో ఇలా చరణ్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇచ్చారా? అనే ప్రశ్న మొదలైంది. అయితే కొడుకు ఫామ్‌ను ఉపయోగించుకోవాల్సిన పరిస్థితిలో చిరంజీవి అయితే లేడు. కాబట్టి ట్రైలర్‌ కట్‌ ఇలా ఎందుకు ఉంది అనేదే ప్రశ్న.

సోషల్‌ మీడియాలో కూడా ఇలాంటి ప్రశ్నలే కనిపిస్తున్నాయి. సినిమా ఆర్డ‌ర్‌లోనే ట్రైలర్‌ కట్‌ చేశారా? లేక డిఫరెంట్‌గా ఉంటుందని ట్రైలర్‌ రివర్స్‌లో చేశారా అనేది తెలియడం లేదు. ట్రైలర్‌ బట్టి చూస్తే… ఈ సినిమాలో సిద్ధ పాత్ర చనిపోతుంది. ఆ తర్వాత ఆ ప్రాంతంలోకి ఆచార్య ఎంటర్‌ అవుతాడు. తన కామ్రెడ్‌ సిద్ధను హత్య చేసిన వాళ్లను భరతం పడతాడు అని అంటున్నారు. అయితే కొరటాల శివ ఏం మ్యాజిక్‌ చేస్తారు అనేది చూడాలి. సిద్ధ పాత్ర చనిపోతే మెగా ఫ్యాన్స్‌ ఎలా తీసుకుంటారు అనేది అర్థం కావడం లేదు.

ట్రైలర్‌లో హీరోయిన్లను చూపించిన కాన్సెప్ట్‌లో కూడా హీరో ఎవరు అనే డౌట్‌ వస్తోంది. సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉన్న విషయం తెలిసిందే. చిరంజీవి సరసన కాజల్‌ నటించింది. రామ్‌చరణ్‌ పక్కన పూజా హెగ్డే ఆడిపాడింది. అయితే ట్రైలర్‌లో పూజను మాత్రమే చూపించారు. అంటే రామ్‌చరణ్‌ పాత్రను మాత్రమే హైలైట్‌ చేశారు. దీంతో హీరో ఎవరు, గెస్ట్‌ ఎవరు అనే ప్రశ్న మళ్లీ వస్తోంది. అయితే సినిమాకు రెండో ట్రైలర్‌ ఉంటుందని టాక్‌ నడుస్తోంది. అందులో ఇంకొచెం క్లారిటీ వస్తుందేమో.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus