Adipurush: వివాదాల వల్లే ఆదిపురుష్ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ ఉందా?

ఆదిపురుష్ మూవీ రిలీజ్ కు కేవలం వారం రోజుల సమయం మాత్రమే ఉందనే సంగతి తెలిసిందే. ఈ సినిమాను రిలీజ్ కు ముందు కూడా వేర్వేరు వివాదాలు చుట్టుముడుతున్నాయి. ప్రభాస్ కు మీసాలు ఉండటంపై నటి కస్తూరి శంకర్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దర్శకుడు ఓం రౌత్ కృతి సనన్ కు తిరుమల ఆలయం ముందు ముద్దు పెట్టడం కూడా సోషల్ మీడియాలో వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే.

అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం గతంలో కొన్ని సినిమాలకు వివాదాలు ప్లస్ అయ్యాయని వివాదాల వల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు ఉన్నాయని ఈ సినిమా విషయంలో కూడా అదే జరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వివాదాల వల్ల ఆదిపురుష్ మూవీ రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రముఖ సంస్థలు భారీ మొత్తంలో మొత్తంలో ఖర్చు చేస్తున్నాయి.

వివాదాలతో ఆదిపురుష్ (Adipurush) మూవీ ఏ రేంజ్ కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో లేదో చూడాల్సి ఉంది. ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగిందని సమాచారం అందుతోంది. ఆదిపురుష్ సినిమా గురించి అంచనాలు పెరుగుతుండగా ఏకంగా మూడు గంటల నిడివితో ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది.

ఆదిపురుష్ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు ఏకంగా 170 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. పీపుల్స్ మీడియా ఈ సినిమా హక్కుల విషయంలో ఒకింత రిస్క్ చేసిందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఈ సినిమా నైజాం హక్కులు తీసుకోవడం గమనార్హం. ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకున్న మైత్రీ నిర్మాతలు ఈ సినిమాతో అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తారేమో చూడాల్సి ఉంది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus