సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలయికలో రూపొందిన ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీ ‘కూలీ’. అక్కినేని నాగార్జున ఈ సినిమాలో విలన్ రోల్ చేస్తుండగా ఉపేంద్ర, అమీర్ ఖాన్ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 14న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ప్రమోషన్స్ లో భాగంగా వదిలిన కంటెంట్ అంతటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ట్రైలర్ ను కూడా వదిలారు.
‘కూలీ’ ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది 3 నిమిషాల 7 సెకన్ల నిడివి కలిగి ఉంది. ‘ఒకడు పుట్టగానే వాడు ఎవడి చేతిలో చావాలనేది రాసి పెట్టి ఉంటుంది’ అంటూ నాగార్జున వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలైంది. దాదాపు నిమిషం వరకు రజినీకాంత్ ఎంట్రీ లేదు. అప్పటివరకు సైమన్(నాగార్జున) గ్యాంగ్ చేసే వయొలెన్స్ ను చూపించారు. కానీ నాగార్జునని నెగిటివ్ గా ఎక్కువ చూపించలేదు. విలన్ రోల్ అయినప్పటికీ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు నాగ్. చెప్పాలంటే రజనీ కంటే నాగార్జునకే ఎక్కువమంది అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక రజినీకాంత్ ట్రైలర్లో కొంచెం లేట్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఆయన మార్క్ స్టైల్ తో అలరించారు అని చెప్పాలి.
శృతి హాసన్ రోల్ కి కూడా మంచి ప్రాముఖ్యత ఉంటుందని ట్రైలర్ తో హింట్ ఇచ్చారు. ‘కూలీ’ కథలో చాలా షేడ్స్ ఉంటాయని ట్రైలర్ తో దర్శకుడు లోకేష్ కనగరాజ్ హింట్ ఇచ్చాడని చెప్పాలి. అలాగే అనిరుధ్ బీజీఎం కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :