Vijay Devarakonda: విజయ్ దేవరకొండ కొత్త సినిమా పోస్టర్ పై కాపీ ఆరోపణలు.. నిర్మాత క్లారిటీ..!

విజయ్ దేవరకొండ హీరోగా ‘జెర్సీ’ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే సైలెంట్ గా పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది. శ్రీలీల హీరోయిన్. నిన్న విజయ్ దేవరకొండ పుట్టినరోజు కావడంతో ఓ పోస్టర్ ను వదిలారు. ఇది బ్లాక్ అండ్ వైట్ లో ఉంది. హీరో మొహాన్ని ముక్కలు చేసి మళ్ళీ పక్క పక్కనే పెడితే ఎలా ఉంటుందో ఈ పోస్టర్ అలా ఉంది.

‘కె.జి.ఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ కు హీరోని బ్లాక్ కలర్ బ్లాక్ డ్రెస్ లో చూపించడం ఇష్టం అనుకుంటే… మన గౌతమ్ కు హీరో ఫస్ట్ లుక్ ను బ్లాక్ అండ్ వైట్ లో చూపించడం ఇష్టమనుకుంట. సరే ఇది ఒక పీరియాడిక్ స్పై థ్రిల్లర్ అని తెలుస్తుంది. నిజానికి గౌతమ్ ఈ కథని రాంచరణ్ తో చేయాలని అనుకున్నాడు.

కానీ చరణ్ ఎందుకో వెనకడుగు వేయడంతో విజయ్ దేవరకొండతో చేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. నిన్న రిలీజ్ అయిన పోస్టర్ కాపీ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ‘ఆర్గో’ అనే హాలీవుడ్ సినిమా పోస్టర్ ను పోలి ఈ పోస్టర్ ఉందని కొందరు కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఆ సినిమాకి ఈ సినిమా కాపీ అనే ఊహాగానాలు కూడా వ్యక్తమయ్యాయి.

దీంతో నిర్మాత నాగ వంశీ రంగంలోకి ఇది.. ‘మాది కాపీ సినిమా కాదు. పోస్టర్ అనేది వేరు. ఇది కో ఇన్సిడెన్స్ అని కూడా అనుకోవచ్చు’ అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇక (Vijay Devarakonda) విజయ్ – గౌతమ్ ల చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus