Skanda: ఆ సినిమాలను గుర్తు చేస్తున్న స్కంద మూవీ.. ఏం జరిగిందంటే?

రామ్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన స్కంద మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు 10.27 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. బుకింగ్స్ తో సంబంధం లేకుండా ఫస్ట్ వీకెండ్ వరకు ఈ సినిమా చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను సాధించే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ఈ సినిమా రవితేజ బెంగాల్ టైగర్ సినిమాను పోలి ఉందని కామెంట్లు చేస్తున్నారు. సంపత్ నంది డైరెక్షన్ లో తెరకెక్కిన బెంగాల్ టైగర్ మూవీ అబవ్ యావరేజ్ గా నిలిచింది.

బెంగాల్ టైగర్, స్కంద (Skanda) సినిమాలను పరిశీలిస్తే హీరో రోల్, హీరోయిన్ రోల్ సిమిలర్ గా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి కొందరు ఈ సినిమాను సరైనోడు సినిమాతో పోలుస్తున్నారు. సరైనోడు సినిమాలో రకుల్ కు ఇబ్బందులు ఎదురైతే హీరో పరిష్కరించగా స్కంద సినిమాలో సయీ మంజ్రేకర్, ఆమె కుటుంబానికి సమస్యలు ఎదురైతే ఆ సమస్యలను హీరో పరిష్కరించడం గమనార్హం.

స్కంద క్లైమాక్స్ ట్విస్ట్ మరీ అంత గొప్పగా అయితే లేదు. సినిమాలో యాక్షన్ సీన్స్ నిడివి ఎక్కువగా ఉండటం వల్ల కొంతమందికి ఈ సినిమా బోరింగ్ ఫీల్ ను కలిగిస్తోంది. సోమవారం నుంచి ఈ సినిమా కలెక్షన్లు ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది. బోయపాటి శ్రీను ఈ సినిమాతో మరో భారీ సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నట్టే అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

బోయపాటి శ్రీను రేంజ్ ను ఈ సినిమా మరింత పెంచుతుందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. స్కంద సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్లు సాధిస్తుందో చూడాల్సి ఉంది. స్కంద సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. స్కంద సినిమా మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus