ట్రైలర్ తోనే సినిమా ఎక్కడి నుంచి కాపీ కొట్టారో కనిపెట్టిన నెటిజన్లు

  • November 14, 2018 / 11:30 AM IST

ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చిన ఈ డిజిటల్ యుగంలో ఎంత పెద్ద సీక్రెట్ అయినా ఎక్కువ రోజులు దాగదు. అలాంటిది సినిమాల సంగతి వేరేగా చెప్పాలా. ఇదివరకూ సినిమా రిలీజైన రెండుమూడు రోజుల తర్వాత సదరు సినిమాలో సన్నివేశాలు ఎక్కడి నుంచి కాపీ కొట్టారు లేదా ఇన్స్పైర్ అయ్యారు అనే విషయం తెలిసేది. కానీ.. ఈమధ్యకాలంలో ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి రావడంతో టీజర్, ట్రైలర్ లేదా పోస్టర్స్ విడుదలైనప్పుడే ఆ సినిమా కథ ఎలా ఉండబోతోంది, ఏ సినిమా నుంచి కాపీ కొట్టారు అనే విషయం తెలిసిపోతుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ తాజా చిత్రమైన “టాక్సీవాలా” విషయంలోనూ అదే జరిగింది.

ఇంకో మూడు రోజుల్లో విడుదలకానున్న టాక్సీవాలా చిత్రం ఒక హాలీవుడ్ సినిమాకి కాపీ అని తేల్చేస్తున్నారు నెటిజన్లు. ఆల్రెడీ ఈ సినిమా అన్ కట్ వెర్షన్ నెట్ లో రిలీజ్ అయిపోవడంతో ఆ వెర్షన్ చూసిన కొందరు, ట్రైలర్ ను చూసిన మరికొందరు “టాక్సీవాలా” చిత్రం 1983లో హాలీవుడ్ లో వచ్చిన “కృస్టీన్” అనే ఆంగ్ల చిత్రానికి కాపీ అని చెబుతున్నారు. ఈ వార్తలో నిజం ఎంత, అబద్ధం ఎంత అనేది మరో మూడు రోజుల్లో తెలిసిపోనున్నప్పటికీ.. ప్రస్తుతానికి “టాక్సీవాలా” మరియు “కృస్టీన్” ట్రైలర్లు చూస్తున్నవారు మాత్రం నిజమేనేమో అనుకొంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus