‘సైరా’ పై దుష్ప్రచారం అంత మంచిది కాదేమో..!

  • August 22, 2019 / 04:35 PM IST

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా ‘సైరా’ ప్రమోషన్ల డోస్ పెంచారు చిత్ర యూనిట్ సభ్యులు. ఆగష్టు 14న మేకింగ్ వీడియో, అలాగే ఆగష్టు 20 న టీజర్ విడుదల చేయడం అభిమానులకి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. అయితే కొందరు నెటిజెన్లు మాత్రం ‘సైరా’ టీజర్ ను ట్రోల్ చేస్తుండడం విశేషం. విషయం ఏమిటంటే ‘సైరా’ టీజర్ లోని కొన్ని సీన్లు ‘బాహుబలి’ నుండీ లేపేసారని వారు కామెంట్లు పెడుతున్నారు. ఈ రెండు టీజర్లలోని కొన్ని ఫోటోలను పోలుస్తూ వాళ్ళు ఈ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి బ్రిటిష్ సైనికుల పైకి దూకి ఎగిరి కత్తులు దూయడం… పొదల్లో నుండీ గుర్రం పై స్వారీ చేయడం ఇవి ‘బాహుబలి’ చిత్రం నుండీ లేపేశారు అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ‘సైరా’ లాంటి చారిత్రాత్మక సినిమా రావడానికి ‘బాహుబలి’ చిత్రం స్ఫూర్తే అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ‘బాహుబలి’ కూడా ‘300’ వంటి హాలీవుడ్ సినిమాల నుండీ స్ఫూర్తిగా తీసుకున్న సినిమానే అన్న విషయం మాత్రం మరిచిపోకూడదు. ‘బాహుబలి’ తెలుగు సినిమా ఖ్యాతిని ఎంత పెంచిందో.. అలాగే ‘సైరా’ చిత్రం కూడా అదే విధంగా తెలుగు సినిమా స్టామినాని పెంచే విధంగా అయితే ఇలాంటి సినిమాలు మరిన్ని వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి కాపీ ట్రోలింగ్ చేయడం కరెక్ట్ కాదనే చెప్పాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus