Tollywood: టాలీవుడ్ కి పెద్ద దెబ్బే!

టాలీవుడ్ కి సమ్మర్ సీజన్ చాలా ముఖ్యమైంది. కానీ కరోనా కరోనా కారణంగా ఇప్పటికీ 2020 సమ్మర్ పూర్తిగా ఎగిరిపోయింది. ఇప్పుడు 2021 సమ్మర్ కూడా అయిపోయినట్లే కనిపిస్తోంది. ఏప్రిల్ మొదటి వారం ‘వకీల్ సాబ్’ సినిమాతో సినిమాల జాతర మొదలు కావాల్సివుంది. ‘వకీల్ సాబ్’ సినిమాకి హిట్ టాక్ రావడం, జనాలు థియేటర్లకు క్యూ కట్టడంతో టాలీవుడ్ కి పూర్వవైభవం వచ్చిందనుకున్నారు. అనుకునేలోపే ఏపీలో టికెట్ రేట్ల గొడవ మొదలైంది. దీంతో సినిమాలన్నీ వాయిదా పడడం మొదలైంది.

ఈ నెల 16న రావాల్సిన ‘లవ్ స్టోరీ’ వాయిదా పడింది. అలానే 23న రావాల్సిన ‘టక్ జగదీష్’ కూడా అదే దారిలో వెళ్లింది. ఇప్పుడు ‘విరాటపర్వం’ లాంటి పేరున్న సినిమాతో పాటు ‘పాగల్’ లాంటి చిన్న సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. ఆ విధంగా ఏప్రిల్ నెలలో రావాల్సిన సినిమాలన్నీ పక్కకు తప్పుకున్నాయి. ఇక మే నెలలో రావాల్సిన పెద్ద సినిమా ‘ఆచార్య’ కూడా వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా జూన్ కి వెళ్లే ఛాన్స్ ఉందని అంటున్నారు.

అలానే బాలయ్య ‘అఖండ’ సినిమా కూడా మేలోనే రావాల్సివుంది. కానీ ఈ సినిమాకి సంబంధించిన వర్క్ ఇంకా బ్యాలెన్స్ ఉందని.. కరోనా ఇలానే ఉంటే గనుక వర్క్ కూడా ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి మరో నెల వరకు సరైన సినిమానే లేదని తెలుస్తోంది. బాలయ్య ‘అఖండ’ సినిమా కూడా రాకపోతే పెద్ద సినిమాలేవీ లేకుండానే సమ్మర్ అయిపోతుంది. ఆ తరువాత అయినా సినిమాలు రిలీజ్ అవుతాయేమో చూడాలి!

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus