Dhanush, Aishwarya: తలైవా రెండేళ్ల కష్టం వృథా.. ధనుష్‌కు విడాకులు మంజూరు!

ప్రముఖ నటుడు నటుడు ధనుష్ (Dhanush) , ఐశ్వర్యకు (Aishwarya) చెన్నై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. రెండేళ్ల క్రితమే వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించగా..  ఈ విషయంలో ఇప్పటివరకు కోర్టులో, బయట వాదనలు, మధ్యవర్తిత్వాలు జరిగాయి. అయితే అవేవీ ఫలించకపోవడంతో ఫైనల్‌గా న్యాయస్థానంలో విడాకులు మంజూరు చేశారు. ఈ మేరకు బుధవారం చెన్నైలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ధనుష్‌, ఐశ్వర్యకు 2004లో వివాహం జరిగింది. వీరికి లింగ, యాత్ర అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.

Dhanush, Aishwarya

అయితే అనూహ్యంగా రెండేళ్ల క్రితం తాము విడిపోతున్నట్లు ఇద్దరూ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో వారికి సర్ది చెప్పేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. అయినప్పటికీ ఇద్దరి ఆలోచనలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ మేరకు తమకు విడాకులు ఇప్పించండి అంటూ ఆరు నెలల క్రితం ఈ విషయంలో చెన్నై ఫ్యామిలీ వెల్‌ఫేర్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు. న్యాయమూర్తి సుభాదేవి ముందు ఈ పిటిషన్‌ మూడుస్లారు విచారణకు వచ్చింది.

అప్పుడు ధనుష్‌, ఐశ్వర్య హాజరుకాకపోవడంతో విచారణ ఈ నెల 21కి వాయిదా వేశారు. ఆ రోజు వచ్చిన ఇద్దరినీ విచారించారు. తాము విడిపోవడానికి నిశ్చయించుకున్నట్లు చెప్పారు. విచారణ అనంతరం తీర్పును 27కి వాయిదా వేసిన న్యాయమూర్తి.. బుధవారం ధనుష్, ఐశ్వర్యలకు విడాకులు మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చారు. దీంతో రెండేళ్ల నుండి నలుగుతున్న విషయం తేలిపోయింది. ఇద్దరికీ విడాకులు వచ్చేశారు.

మరి పిల్లల విషయంలో ఏం నిర్ణయం తీసుకున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఈ విడాకులను ఆపడానికి ఇటు రజనీకాంత్‌ కుటుంబం, అటు ధనుష్‌ తండ్రి చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల దీపావళి సందర్భంగా తలైవా ఇంటికి ధనుష్‌ వెళ్లాడని, అంతా ఓకే అయిందని వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు విడాకులు మంజూరు అయ్యాయి. దీంతో ఈ విషయంలో రజనీకాంత్‌ (Rajinikanth)  ప్రయత్నాలు విఫలమయ్యాయి అని చెప్పాలి. బంధాల విషయంలో బయటి మాటలు అన్నిసార్లూ పనికిరావు అని మరోసారి తేలింది.

సినిమా పోయిందనే బాధలో ఉంటే.. మరోవైపు వెన్నుపోటు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus