వరుణ్ తేజ్ (Varun Tej) నటించిన ‘మట్కా’ (Matka) సినిమా ఇటీవల అంటే నవంబర్ 14 న రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే ఈ సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాలేదు. ‘వైరా ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ పై విజయేందర్ రెడ్డి (Vijender Reddy) తీగల ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘హాయ్ నాన్న’ (Hi Nanna) సినిమాకు కూడా ఈయనే నిర్మాత. అది బాగానే ఆడింది. కానీ ‘మట్కా’ డిజాస్టర్ అవ్వడంతో దాదాపు రూ.25 కోట్లు ఇతను నష్టపోయినట్టు తెలుస్తుంది.
ఈ బాధలో ఉండగా.. ఇతనికి మరో షాక్ కూడా తగిలింది. తన వద్ద పనిచేసే ఓ వ్యక్తి ఏకంగా రూ.5 కోట్ల వరకు స్కామ్ చేశాడట. వివరాల్లోకి వెళితే.. ‘వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్’ సీఈఓ అయినటువంటి ఓ వ్యక్తి దాదాపు రూ.5.5 కోట్లు స్కామ్ చేశాడట. దొంగ లెక్కలు చూపించి రూ.5.5 కోట్లు తస్కరించినట్టు ఇండస్ట్రీ టాక్. ‘మట్కా’ తో పాటు ‘హాయ్ నాన్న’ చిత్రానికి కూడా ఇతనే సీఈఓ అని తెలుస్తుంది.ఇతనికి నెలకి రూ.2.5 లక్షల జీతం ఇస్తున్నారట.
మరోపక్క సొంతంగా బిజినెస్..లు కూడా చేసుకుంటున్నాడు. అటువైపు నుండి కూడా లక్షలు సంపాదిస్తున్నాడు.అయితే నిర్మాతని నమ్మించి ఏకంగా రూ.5 కోట్లు నొక్కేసి సెటిల్ అయిపోదామని అనుకున్నట్టు ఉన్నాడు. ‘మట్కా’ సినిమా రిలీజ్ టైమ్లో ఈ సీఈఓ పై నిర్మాతలకి కంప్లైంట్ వెళ్లిందట.దీంతో నిర్మాతలు చెకింగ్లు చేయగా.. ఇతని వ్యవహారం బయటపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇతన్ని ఆఫీస్ కి రావొద్దని చెప్పారట.
‘హాయ్ నాన్న’ లెక్కలు కూడా క్రాస్ చెక్ చేసి అందులో కూడా మతలబులు ఉంటే లీగల్ గా అతనిపై యాక్షన్ తీసుకోవాలని నిర్మాతలు డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. మంచి పొజిషన్లో హుందాగా లక్షలు జీతం తీసుకుంటున్నప్పటికీ షార్ట్ కట్లో ఎక్కువగా నొక్కేయాలని చూసిన ఈ సీఈవో పరిస్థితి తర్వాత ఏమవుతుందో ఏమో..!