నాని (Nani) సమర్పణలో ‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని (Prashanti Tipirneni) నిర్మాణంలో ‘కోర్ట్’ (Court) అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ప్రియదర్శి (Priyadarshi Pulikonda) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకి ‘స్టేట్ వర్సెస్ నో బడీ’ అనేది ఉప శీర్షిక. మార్చి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కంటెంట్ పై ఉన్న నమ్మకంతో విడుదలకి 2 రోజుల ముందే ప్రిమియర్స్ వేశారు. వాటికి మంచి స్పందన లభించింది. బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చాయి.
దీంతో రెండు రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ఆదివారం రోజున మరింతగా క్యాష్ చేసుకుంది. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 4.37 కోట్లు |
సీడెడ్ | 0.58 కోట్లు |
ఆంధ్ర(టోటల్) | 3.13 కోట్లు |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 8.16 కోట్లు |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ |
2.98 కోట్లు |
వరల్డ్ వైడ్ (టోటల్) | 11.14 కోట్లు(షేర్) |
‘కోర్ట్’ సినిమాకు రూ.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.7.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా 3 రోజుల్లో అంటే వీకెండ్ ముగిసేసరికి రూ.11.14 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇప్పటికే రూ.3.64 కోట్ల ప్రాఫిట్స్ తో బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిన ఈ సినిమా.. వీకెండ్లో ఎలా కలెక్ట్ చేస్తుందో చూడాలి. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.21.40 కోట్ల వరకు కొల్లగొట్టింది.