కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ‘క’ తో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుని ఫామ్లోకి వచ్చాడు. దీంతో అతని నెక్స్ట్ మూవీ ‘దిల్ రూబా’ (Dilruba) పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. రుక్సార్ ధిల్లాన్ (Rukshar Dhillon) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో విశ్వ కరుణ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. మార్చి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మొదటి షోతోనే నెగిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది.
నిర్మాత రవి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ‘ఈ సినిమా కనుక మీకు నచ్చకపోతే నన్ను మా ఆఫీస్ కి వచ్చి బయటకు విసిరేయండి’ అంటూ చేసిన కామెంట్స్ పై సెటైర్లు కూడా గట్టిగానే పడ్డాయి. ఒకసారి ‘దిల్ రూబా’ (Dilruba) క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.48 cr |
సీడెడ్ | 0.24 cr |
ఉత్తరాంధ్ర | 0.25 cr |
ఈస్ట్ | 0.09 cr |
వెస్ట్ | 0.05 cr |
గుంటూరు | 0.12 cr |
కృష్ణా | 0.19 cr |
నెల్లూరు | 0.07 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 1.49 cr (షేర్) |
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ | 0.20 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 1.69 cr (షేర్) |
‘దిల్ రూబా’ (Dilruba) చిత్రానికి రూ.8.6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.9 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా కేవలం రూ.1.69 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.2.8 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కి రూ.7.31 కోట్ల (షేర్) దూరంలో ఆగిపోయి పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది ఈ సినిమా.