Court: కోర్ట్ హిట్టుతో మరో బిగ్ స్కెచ్ లో నాని!

సినిమా ఫలితాన్ని అంచనా వేయడం ఎంత కష్టమో ఇండస్ట్రీకి ‘కోర్ట్’ మరోసారి రుచి చూపించింది. థియేట్రికల్ బిజినెస్ తగ్గిపోతున్న కాలంలో ఓ కోర్ట్ (Court) రూమ్ డ్రామా బాక్సాఫీస్‌ దగ్గర బ్లాక్‌బస్టర్ అనిపించుకోవడం సాధారణ విషయం కాదు. నాని నిర్మాతగా వచ్చిన ఈ సినిమా తొలి వీకెండ్ నుంచే భారీ వసూళ్లు సాధించింది. ముఖ్యంగా నైజాం ఏరియాలో ప్రేక్షకుల మద్దతు ఊహించనంత స్థాయిలో ఉంది. తక్కువ బడ్జెట్‌లో పెద్ద విజయాన్ని అందుకున్న కోర్ట్ ఇప్పుడు కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తుందా అనే చర్చ మొదలైంది.

Court

నాని (Nani) గతంలో అ! – హిట్ లాంటి వినూత్న సినిమాలను సమర్పించి తన నిర్మాతగా మార్క్ చూపించాడు. ఇప్పుడు ‘కోర్ట్’ కూడా ఆ లిస్ట్‌లో చేరడంతో మరో సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీ ఆవిష్కృతమవుతుందా అనే అంచనాలు పెరిగాయి. ఇటీవల సక్సెస్ మీట్‌లో నాని ‘కోర్ట్ 2’ గురించి హింట్ ఇవ్వడంతో మరింత ఆసక్తికరంగా మారింది. కథ పరంగా కొత్త కోణాన్ని ఎంచుకుని, పెద్ద స్కేల్‌లో సీక్వెల్ ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్.

ట్రేడ్ వర్గాల అభిప్రాయం ప్రకారం, కోర్ట్‌ రూమ్ డ్రామాలకు ఓటీటీలోను, థియేటర్లలోను మంచి క్రేజ్ ఉంటుంది. ‘హిట్’ ఫ్రాంచైజీ మాదిరిగానే ‘కోర్ట్’ సిరీస్‌ను కూడా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. మొదటి భాగంలో వచ్చిన ఫోక్సో పాయింట్‌లో మరో లీగల్ థ్రిల్లర్‌ను నెక్స్ట్ పార్ట్‌గా రూపొందించే ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం. ప్రధాన పాత్రల్ని కొనసాగిస్తూ, కథను కొత్త మలుపులోకి తీసుకెళ్లేలా స్క్రిప్ట్ వర్క్‌ జరుగుతున్నట్లు టాక్.

ఇప్పటికే కోర్ట్ దర్శకుడు రామ్ జగదీష్‌తో నాని మరో సినిమా కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ముందు కోర్ట్ 2 చేయాలా? లేక మధ్యలో మరో కమర్షియల్ సినిమా చేసి ఆ తర్వాత సీక్వెల్ అనౌన్స్ చేయాలా? అనే అంశంపై చర్చ కొనసాగుతోంది. ఈ విజయంతో నాని నిర్మాతగా మరింత కాన్ఫిడెన్స్‌తో ముందుకెళ్తున్నాడు.

కోర్ట్ తొలి వారంలోనే భారీ వసూళ్లు సాధించినందున, వీకెండ్‌లో మరోసారి కలెక్షన్ల ఊపు కనిపించే అవకాశం ఉంది. దాంతో, ఇది కేవలం ఒక్క సినిమాతో ఆగిపోని ప్రాజెక్ట్ అని అర్థమవుతోంది. త్వరలోనే కోర్ట్ 2 గురించి అధికారిక సమాచారం వచ్చే అవకాశముండగా, ‘హిట్’ తర్వాత నాని చేతిలో మరో ఫ్రాంచైజీ పక్కాగా ఉన్నట్లు ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus