Prabhas: ‘ఆదిపురుష్‌’ తెచ్చిన కొత్త కష్టం!

‘ఆదిపురుష్‌’ టీజర్‌ను చూశాక అభిమానులు ఎంతగా హర్ట్‌ అయ్యారో, అందులో పాత్రలను చూపించిన వైనం చూసి ఓ వర్గం ప్రజలు అంతగానే హర్ట్‌ అయ్యారు. చిత్రబృందాన్ని ఓవైపు మీడియా సాక్షిగా ఓ వర్గం ఏకిపారేస్తుంటే, సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ మీమ్స్‌తో చుక్కలు చూపిస్తున్నారు. దీంతో ఈ సినిమా తెలుగు పీఆర్‌ టీమ్‌ జాకీలేసి లేపే ప్రయత్నం చేస్తోంది. ఇదంతా ఒక లెక్క అయితే.. ఇప్పుడు ఏకంగా ఈ సినిమా విషయంలో చిత్రబృందానికి కొర్టు నోటీసులు వచ్చాయి. దీంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.

‘ఆదిపురుష్‌’ చిత్ర బృందానికి దిల్లీ కోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్‌’ సినిమాలో ప్రభాస్‌ రాముడి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్‌ విషయంలో కొన్ని వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో ఓ సంస్థ ఏకంగా దిల్లీ కోర్టును ఆశ్రయించింది. ‘ఆదిపురుష్‌’ సినిమా విడుదలపై స్టే విధించాలని కోరింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన దిల్లీ కోర్టు… ప్రభాస్‌తో పాటు ‘ఆదిపురుష్‌’ చిత్ర బృందానికి నోటీసులు జారీ చేసింది.

‘ఆదిపురుష్‌’ సినిమాలో రాముడు, రావణుడు, హనుమంతుడు పాత్రలను చూపించిన విధానం సరిగ్గా లేదని ఆ వర్గాల వాదన. రామాయణం గురించి సరిగ్గా అధ్యయనం చేయకుండానే ఓం రౌత్‌ ‘ఆదిపురుష్‌’ తెరకెక్కించారంటూ ఆయనపై రాజకీయ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా టీజర్‌ ప్రజల మనోభావాలు, సెంటిమెంట్లను దెబ్బ తీసేలా ఉందని బీజేపీ అధికార ప్రతినిధి మాళవికా అవినాష్ అన్నారు. మధ్యప్రదేశ్ హోమ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా కూడా ఇదే మాట అన్నారు.

ఉత్తర ప్రదేశ్‌లోని బ్రాహ్మణ సంఘాలు కూడా ఈ సినిమా విషయంలో నిరసన తెలిపాయి. అయోధ్యలోని ఓ పూజారి సినిమాపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు ప్రమోద్ పాండే అనే న్యాయవాది కోర్టులో కేసు వేశారు. అయితే మీమర్స్‌, ట్రోలర్స్‌ను పబ్లిక్‌ టాక్‌ వీడియోతో కంట్రోల్‌ చేయాలనుకున్న పీఆర్‌ టీమ్‌.. ఇప్పుడేం చేస్తుందో చూడాలి.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus