Pallavi Prashanth: ప్రశాంత్ కు ఏమైనా జరిగితే వాళ్లదే బాధ్యత.. సీపీఐ నారాయణ ఏమన్నారంటే?

  • December 21, 2023 / 03:50 PM IST

బిగ్ బాస్ షో సీజన్7 విన్నర్ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చేసిన తప్పుల వల్ల అరెస్ట్ అయ్యి జైలులో ఉన్నారు. పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉండగా నాంపల్లి కోర్టు ప్రశాంత్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని ప్రశాంత్ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. అయితే సీపీఐ నారాయణ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

పల్లవి ప్రశాంత్ పై పోలీసులు ప్రతాపం చూపించడం కాదని బిగ్ బాస్ నిర్వాహకులపై చూపించాలని అన్నారు. బిగ్ బాస్ షోలో పాల్గొన్న రైతు బిడ్డను హింసించడం, కేసు పెట్టడం కరెక్ట్ కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. పల్లవి ప్రశాంత్ ఆత్మహత్య చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారని సీపీఐ నారాయణ ప్రశ్నించారు.ప్రశాంత్ కు ఏమైనా జరిగితే పోలీసులదే బాధ్యత అని సీపీఐ నారాయణ అన్నారు. సీపీఐ నారాయణ కామెంట్లు చేసిన కొన్ని గంటల్లోనే పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యారు.

పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన మంచి గుర్తింపును చిన్నచిన్న పొరపాట్ల వల్ల పోగొట్టుకున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పల్లవి ప్రశాంత్ గురించి పలువురు మీడియా ప్రతినిధులు సైతం ఫైర్ అయిన సంగతి తెలిసిందే. పల్లవి ప్రశాంత్ పై ఊహించని స్థాయిలో నెగిటివిటీ రావడం ఆయన అభిమానులకు ఊహించని స్థాయిలో షాకివ్వడం గమనార్హం.

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత (Pallavi Prashanth) పల్లవి ప్రశాంత్ సినిమా ఆఫర్లతో బిజీ అవుతారని అందరూ భావించగా అంచనాలకు భిన్నంగా పల్లవి ప్రశాంత్ పై కేసులు నమోదయ్యాయి. పల్లవి ప్రశాంత్ బెయిల్ కోసం పిటిషన్ వేసిన నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. రాబోయే రోజుల్లో పల్లవి ప్రశాంత్ కెరీర్ ను మరింత జాగ్రత్తగా కెరీర్ ను ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus