Ravi Teja: రవితేజ క్రేజ్ చూశారా..?

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరైన సినిమా పడలేదనే చెప్పాలి. దసరాకు ‘గాడ్ ఫాదర్’, ఈ నెలలో ‘హిట్2’ సినిమాలు కొంచెం సందడి చేశాయి. మిగతా సినిమాలు చాలా వరకు బోల్తా కొట్టాయి. క్రిస్మస్ సమయంలో బాక్సాఫీస్ వద్ద జోరు ఉంటుందనుకుంటే.. ఈ సీజన్ కు షెడ్యూల్ అయిన సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ చూసి ట్రేడ్ షాక్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ధమాకా’, నిఖిల్ ’18 పేజెస్’ సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి.

రిలీజ్ కు ముందు సినిమాలపై మంచి బజ్ ఉన్నప్పటికీ.. అడ్వాన్స్ బుకింగ్స్ లో ఆ క్రేజ్ కనిపించలేదు. ’18 పేజెస్’ సినిమా స్థాయి తక్కువ కాబట్టి ఓకే కానీ.. రవితేజ సినిమాకు ఎన్నడూ లేని విధంగా అడ్వాన్స్ బుకింగ్స్ వీక్ గా ఉండడం చూసి చాలా మంది షాక్ అయ్యారు. చిత్రబృందం కూడా బాగా టెన్షన్ పడిందనే చెప్పాలి. కానీ రిలీజ్ రోజు మాత్రం పరిస్థితి మారిపోయింది. ‘ధమాకా’ థియేటర్ల దగ్గర బాగానే సందడి కనిపించింది.

మార్నింగ్ షోలకు చాలా చోట్ల ఫుల్స్ పడ్డాయి. సినిమాకి డివైడ్ టాక్ వచ్చినా.. రివ్యూలు కూడా అలాగే ఉన్నా.. వాటి ప్రభావం సినిమా వసూళ్లపై పడినట్లు కనిపించలేదు. సాయంత్రం, రాత్రి షోలకు మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. అడ్వాన్స్ బుకింగ్స్ తక్కువగా ఉండి.. సినిమాకి నెగెటివ్ టాక్ వస్తే సాయంత్రానికి థియేటర్లు ఖాళీ అయిపోతాయి. కానీ ‘ధమాకా’ విషయంలో మాత్రం అలా జరగలేదు. మాస్ రాజా ఫ్యాన్స్ ను ఈ సినిమా ఆకట్టుకున్నట్లే ఉంది.

కమర్షియల్ హంగులు పుష్కలంగా ఉండడం సినిమాకి ప్లస్ అయింది. తొలిరోజు ఈ సినిమా రూ.9 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది షాకింగ్ నెంబర్ అనే చెప్పాలి. ఇదే ఊపు శని, ఆదివారాల్లో కూడా కంటిన్యూ అయితే బయ్యర్లు చాలా వరకు సేఫ్ అయిపోతారు.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus