ప్రభాస్ ఫ్యాన్స్ ను ఖుషీ చేసే అప్డేట్..!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ గత ఐదేళ్ళుగా కేవలం ‘బాహుబలి’ చిత్రంతో మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాజమౌళి చిత్రం కాబట్టి.. అందులోనూ రెండు పార్టులుగా వచ్చిన కారణంగా ‘బాహుబలి’ చిత్రం ఇంత సమయం పట్టింది.. ఇక ప్రభాస్ వరుస చిత్రాల్లో కనిపించి థియేటర్లలో సందడి చేస్తాడనుకుంటే… ‘సాహూ’ అనే మరో భారీ బడ్జెట్ చిత్రాన్ని లైన్లో పెట్టాడు ప్రభాస్. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ భారీ ప్రాజెక్ట్ వలెనే… గత సంవత్సరం ప్రభాస్ నుండీ ఒక్క చిత్రం కూడా విడుదల కాలేదు.

అయితే ప్రభాస్ ఇప్పుడు తన అభిమానులకి డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం ‘సాహూ’ చిత్రంతో పాటు.. ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణకుమార్ డైరెక్షన్లో కూడా ప్రభాస్ ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ లో ‘సాహూ’ చిత్రం విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగానే… ప్రభాస్ – రాధాకృష్ణ కుమార్ చిత్రాన్ని కూడా పూర్తి చేయాలని ప్రభాస్ భావిస్తున్నాడట. అందుకు తగినట్టుగానే దర్శకుడు కూడా పక్కా ప్లాన్ తో ఉన్నట్టు తెలుస్తుంది.

ప్రభాస్ 20 వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. మొదట ఈ చిత్రాన్ని 2020 లో విడుదల చేయాలని అనుకున్నప్పటికీ.. షూటింగ్ అనుకున్న సమయం కంటే ముందే పూర్తవనుండడంతో… డిసంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట. ‘సాహూ’ చిత్రాన్ని ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ నిర్మిస్తుండగా.. ప్రభాస్ 20 వ చిత్రాన్ని ‘యూవీ క్రియేషన్స్’ తో పాటూ ‘గోపికృష్ణ మూవీస్’ సంస్థ కూడా కలిసి నిర్మిస్తుండడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus