Mahesh Babu: మహేష్ ఫ్యాన్స్ కు నిరాశ.. అది నిజం కాదట..?

గతేడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సర్కారు వారి పాట ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కాగా త్వరలో సెకండ్ షెడ్యూల్ మొదలు కానుందని సమాచారం. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త గత కొన్నిరోజుల నుంచి వైరల్ అవుతోంది.

గౌతమ్, సితార ఈ సినిమాలో నటిస్తున్నారని వైరల్ అవుతున్న వార్త యొక్క సారాంశం. అయితే సర్కారు వారి పాట యూనిట్ సభ్యులు మాత్రం ఈ వార్తలో నిజం లేదని చెబుతున్నారు. మహేష్ బాబు సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన 1 నేనొక్కడినే సినిమాలో మహేష్ కొడుకు గౌతమ్ నటించిన సంగతి తెలిసిందే. మహేష్ కూతురు సితార యూట్యూబ్ వీడియోల ద్వారా పాపులారిటీని సంపాదించుకున్నారు. మహేష్ సినిమాలో గౌతమ్, సితార నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

వైరల్ అయిన వార్తతో సంతోషపడిన ఫ్యాన్స్ కు చివరకు నిరాశే మిగిలింది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుండటం గమనార్హం. లాక్ డౌన్ సడలింపుల తర్వాత మహేష్ సర్కారు వారి పాట సినిమాతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొనబోతున్నారు. త్రివిక్రమ్ సినిమాలో మహేష్ జేమ్స్ బాండ్ తరహా పాత్రలో నటిస్తారని సమాచారం.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus