Pushpa: ‘పుష్ప’ సినిమాపై క్రేజీ రూమర్!

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో ‘పుష్ప’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. బన్నీ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ‘పుష్ప’ టీజర్ ని విడుదల చేసింది. ఈ టీజర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది. ఊరమాస్ అవతారంలో బన్నీ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తే ఎలా ఉంటుందని బన్నీ, సుకుమార్ లు ఆలోచిస్తున్నారట.

దానికి కారణాలున్నాయి. ‘పుష్ప’ చాలా స్పాన్ ఉన్న కథ. ఇప్పటివరకు రాసుకున్న సన్నివేశాలను తీసితె మూడు గంటలకు పైగా ఫుటేజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదీ కాకుండా.. సుకుమార్ దగ్గర ఈ సినిమాని కొనసాగించే పాయింట్ కూడా ఉందట. ఆ రెండు కలిపి ఒకేసారి సినిమా తీసేసి.. రెండు నెలల గ్యాప్ లో ఈ రెండు భాగాలను విడుదల చేస్తే ఎలా ఉంటుందనే విషయంపై అటు బన్నీ, ఇటు సుకుమార్ తర్జన భర్జనలు పడుతున్నారని టాక్.

ఒకే భాగంగా సినిమాను విడుదల చేయాలనుకుంటే.. అనుకున్న సమయానికి సినిమా విడుదలవుతుంది. లేదంటే వాయిదా పడే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి. ‘బాహుబలి’ సినిమా విషయంలో కూడా ఇలానే జరిగింది. ముందు ఒక సినిమానే తీయాలనుకున్నారు కానీ కథ విస్తారం పెరిగి రెండు భాగాలుగా సినిమా తీశారు. ఇప్పుడు ‘పుష్ప’ విషయంలో కూడా అలానే జరుగుతోంది. కానీ రెండో భాగం తీయాలా..? వద్దా..? అనే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరేం జరుగుతుందో చూడాలి!

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus