అతియా – రాహుల్‌ పెళ్లి ఫొటోలు వైరల్‌.!

మరో బాలీవుడ్‌ – క్రికెట్‌ జంటకు ముడిపడింది. దేశంలో మోస్ట్‌ ఇంట్రెస్టింగ్‌, హ్యాపెనింగ్‌ జోడీ పేరు తెచ్చుకున్న ఈ క్రికెట్‌ – బాలీవుడ్‌ జోడీల లిస్ట్‌లోకి ప్రముఖ క్రికెటర్‌, టీమ్‌ ఇండియా వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ – యువ కథానాయిక అతియా శెట్టి చేరారు. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ సోమవారం ఒకింటి వారయ్యారు. సింపుల్‌గా, సన్నిహితుల మధ్య జరిగిన వేడుకలో అతియా మెడలో లోకేశ్‌ రాహుల్‌ మూడు ముళ్లూ వేశాడు.

ప్రముఖ నటుడు సునీల్‌ శెట్టి తనయ అయిన అతియా శెట్టితో కెఎల్‌ రాహుల్‌ గతకొన్నేళ్లుగా లవ్‌లో ఉన్నారనే విషయం తెలిసిందే. తొలుత పుకారుగా కనిపించిన ఈ వ్యవహారం ఆ తర్వాత కన్‌ఫామ్‌ అయ్యింది. తొలినాళ్లలో అప్పుడప్పుడు యాడ్స్‌లో కనిపించిన ఈ జోడీ ఆ తర్వాత లైవ్‌లోకి వచ్చారు. త్వరలో పెళ్లి అంటూ చాలా రోజులుగా వార్తలు వస్తున్నా ఎట్టకేలకు సోమవారం వివాహ వేడుక జరిగింది.
ఖండాలాలో ఉన్న సునీల్‌ శెట్టి ఫామ్‌ హౌస్‌లో ఈ వేడుకను నిర్వహించారు.

దానికి సంబంధించిన ఫొటోలను నూతన వధూవరులు సోషల్‌ మీడియాలో వేదికగా షేర్‌ చేశారు. కొన్ని రోజుల తర్వాత గ్రాండ్ రిసెప్షన్ ఉండనుందని సమాచారం. దీనికి దాదాపు మూడు వేల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇటు క్రికెట్‌, అటు సినిమా పరిశ్రమ నుండి పెద్ద ఎత్తు గెస్ట్‌లు వస్తారని వార్తలొచ్చినా.. ఆ సంఖ్య మూడు వేలకు మించకుండా చూసుకుంటున్నారని టాక్‌. పెళ్లి విషయానికొస్తే..

ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా, టీమ్‌ మెంటార్ గౌతమ్ గంభీర్, ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్‌, ఇషాంత్‌ శర్మ తదితరులు ఈ వివాహానికి హాజరయ్యారట. వారితోపాటు అతియా శెట్టి స్నేహితురాళ్లు కృష్ణ ష్రాఫ్‌, అన్షులా కపూర్‌ కూడా వచ్చారు. టీమ్‌ ఇండియా అటగాళ్లు అంతా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో బిజీగా ఉన్నారు. ఐపీఎల్‌ అయిపోయాక వీరి రిసెప్షన్‌ ఉంటుందని సమాచారం.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus