Shreyas Iyer,Prabhas: ప్రభాస్ కు నేను పెద్ద ఫ్యాన్.. శ్రేయాస్ అయ్యర్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కు (Prabhas) రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఫ్యాన్స్ ఉన్నారు. ప్రభాస్ ఆటిట్యూడ్ ను ఎంతోమంది అభిమానిస్తారు. అయితే సెలబ్రిటీలు సైతం ప్రభాస్ ను ఎంతగానో అభిమానిస్తారు. క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ ప్రభాస్ కు తాను అభిమానినని ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. శ్రేయాస్ అయ్యర్ తాజాగా మాట్లాడుతూ ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

స్టార్ హీరో ప్రభాస్ ఫ్యాన్స్ ను ప్రేమగా డార్లింగ్ అని పిలుస్తారని అలా పిలిచే ప్రభాస్ కు నేను పెద్ద అభిమానినని శ్రేయాస్ అయ్యర్ చెప్పుకొచ్చారు. బాహుబలి సిరీస్ సినిమాలు చూసిన తర్వాత తాను ప్రభాస్ కు వీరాభిమానిగా మారానని ఆయన కామెంట్లు చేశారు. ప్రభాస్ కు ఫ్యాన్ గా మారిన తర్వాత ప్రభాస్ ను నేను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నానని శ్రేయాస్ అయ్యర్ పేర్కొన్నారు. కరోనా టైమ్ లో ప్రభాస్ నటించిన ప్రతి మూవీ చూస్తూ తాను ఎంజాయ్ చేయడం జరిగిందని ప్రభాస్ సినిమాలు నాకు ఎంతగానో నచ్చాయని శ్రేయాస్ అయ్యర్ కామెంట్లు చేశారు.

కొరటాల శివ (Koratala Siva) డైరెక్షన్ లో ప్రభాస్ నటించిన మిర్చి (Mirchi) సినిమాలో ప్రభాస్ లుక్స్ బాగుంటాయని ఆ సినిమాలో ప్రభాస్ అందంగా కనిపించారని శ్రేయాస్ అయ్యర్ వెల్లడించడం గమనార్హం. రాజాసాబ్ (The Rajasaab) , కల్కి (Kalki 2898 AD) సినిమాలను థియేటర్లలో చూడటం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని శ్రేయాస్ అయ్యర్ పేర్కొన్నారు. క్రికెట్ మ్యాచ్ లు లేకపోతే మాత్రం ప్రభాస్ సినిమాలను రిలీజైన తొలిరోజే కచ్చితంగా చూస్తానని శ్రేయాస్ అయ్యర్ వెల్లడించారు.

ప్రముఖ క్రికెటర్ ప్రభాస్ గురించి, ప్రభాస్ సినిమాల గురించి ప్రశంసల వర్షం కురిపించడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. శ్రేయాస్ అయ్యర్ కామెంట్లు వింటే ప్రభాస్ సైతం ఎంతో సంతోషిస్తారని చెప్పడంలో సందేహం అవసరం లేదని తెలుస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus