గతంలో టాలీవుడ్ స్టార్ దర్శకుడు రాజమౌళి ఈగను పెట్టి సినిమా తీశారు. ఆ సినిమా భారీ విజయం సాధించిందని తెలుగు ప్రేక్షకులందరికి తెలిసిన విషయమే. అదే తరహాలో ఈ మధ్య కాలంలో కాకిని బేస్ చేసుకున్న మూడు సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. కాకి కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది నటుడు, దర్శకుడు వేణు నిర్మించిన బలగం సినిమా గురించి. చాలా సింపుల్ కథను ఎంతో హృద్యంగా తెరకెక్కించి సన్సెస్ అయ్యారు.
ఇటీవల టాలీవుడ్ లో సరికొత్త సెంటిమెంట్ వర్కౌట్ అవుతోంది. అది మరేదో కాదు కాకి.. సినిమాలో కాకులకు ఇంపార్టెన్స్ ఇచ్చి హిట్స్ అందుకుంటున్నారు దర్శకులు. ఈ మధ్య కాలంలో కాకిని బేస్ చేసుకున్న మూడు సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి ఆ సినిమా ఏంటో తెలుసా.. కాకి కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది బలగం సినిమా గురించి. చాలా సింపుల్ కథను ఎంతో హృద్యంగా తెరకెక్కించి సన్సెస్ అయ్యారు నటుడు, దర్శకుడు వేణు.
బలగం సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మనిషి చనిపోయిన తర్వాత కాకి పిండంను తినకపోవడం గురించి చూపించారు. అలా జరిగితే చనిపోయిన వారి ఆత్మ శాంతించదు అనే కాన్సెప్ట్ తో తెరకెక్కించాడు వేణు. గొడవలు మర్చిపోయి కుటుంబం అంతా కలిసి ఉండాలనే కాన్సెప్ట్ తో తెరకెక్కింది ఈ సినిమా.
అలాగే రీసెంట్ గా సాయి ధరమ్ నటించిన విరూపాక్ష సినిమాలోనూ కాకి హైలైట్ గా కనిపిస్తుంది. ఈ సినిమాలో బ్లాక్ మ్యాజిక్ గురించి చూపించారు. బ్లాక్ మ్యాజిక్ ను రిప్రెజెంట్ చేస్తూ కాకులను చూపించారు. ఇక ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది విరూపాక్ష.
ఇక నేచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమాలో కూడా కాకి (Crow) గురించి ఉంటుంది. ఈ సినిమాలో కూడా కాకి పిండాన్ని తినకపోవడాన్ని చూపించాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా కాకులను చూపించి వరుసగా మూడు సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి.
విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?