Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు
- November 1, 2026 / 03:08 PM ISTByPhani Kumar
మాస్ క దాస్ విశ్వక్ సేన్ కి చాలా కాలంగా హిట్ లేదు. 2024 ఆరంభంలో వచ్చిన ‘గామి’ తర్వాత విశ్వక్ చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఈ ఏడాది అనుదీప్ తో చేసిన ‘ఫంకీ’ సైతం అతన్ని గట్టెక్కించలేకపోయింది. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇవ్వాలనే ఉద్దేశంతో తన దర్శకత్వంలోనే ‘కల్ట్'(Cult) అనే సినిమా చేశాడు. ‘తారక్ సినిమాస్’ సంస్థపై సందీప్ కాకరాల ఈ చిత్రాన్ని దాదాపు రూ.25 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ వంటివి చాలా వయొలెంట్ గా అనిపించాయి.
Cult

సెన్సార్ విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది ఈ సినిమా. ‘A’ సర్టిఫికేట్ ఇచ్చినప్పటికీ సెన్సార్ వాళ్ళు ఈ సినిమాలో చాలా సన్నివేశాలు కట్ చేశారు. ఇది ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అయ్యింది. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ఈ సినిమాకి ట్రేడ్ సర్కిల్స్ లో కూడా అంచనాలు పెద్దగా లేవు. అందుకే ‘కల్ట్’ సినిమాకి సొ సొ బిజినెస్ మాత్రమే జరిగింది. ఒకసారి ‘కల్ట్’ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు గమనిస్తే :
| నైజాం | 3 cr |
| సీడెడ్ | 0.5 cr |
| ఆంధ్ర(టోటల్) | 2.5cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 6 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.5 cr |
| ఓవర్సీస్ | 1.5 cr |
| వరల్డ్ వైడ్(టోటల్) | 8 cr |
‘కల్ట్’ సినిమాకి రూ.8 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.8.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. పోటీగా ‘ఆదర్శ కుటుంబం’ సినిమా ఉండటం వల్ల ఈ సినిమాని ఎక్కువ శాతం ఆడియన్స్ పట్టించుకోవడం లేదు. మరి హిట్ టాక్ తెచ్చుకుని అందరి అటెన్షన్ డ్రా చేస్తుందేమో చూడాలి..!














