Custody OTT: కస్టడీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. అక్కడైనా హిట్ అవుతుందా?

నాగచైతన్య, కృతిశెట్టి కాంబినేషన్ లో తెరకెక్కిన బంగార్రాజు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే కస్టడీ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచింది. మానాడు తర్వాత వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ సినిమా నిర్మాతలకు కూడా భారీ నష్టాలను మిగిల్చిందని సమాచారం అందుతోంది. అయితే థియేటర్లలో డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఓటీటీలో మాత్రం హిట్ గా నిలుస్తుందని చైతన్య అభిమానులు భావిస్తున్నారు.

జూన్ నెల 9వ తేదీ నుంచి ఈ సినిమా (Custody) అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం అందుతోంది. అమెజాన్ ప్రైమ్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాలను వెల్లడించింది. కస్టడీ సినిమా అమెజాన్ ప్రైమ్ కు అయినా లాభాలను అందిస్తాయేమో చూడాల్సి ఉంది. నాగచైతన్య ప్రస్తుతం కొత్త కథలు వింటున్నారు. త్వరలో నాగచైతన్య కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది. నాగచైతన్య రెమ్యునరేషన్ ప్రస్తుతం 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

నాగచైతన్యకు వరుస షాకులు తగులుతుండగా కస్టడీ రిజల్ట్ తో కృతిశెట్టి కెరీర్ పై కూడా ప్రభావం పడుతుందని తెలుస్తోంది. కృతిశెట్టి ప్రస్తుతం సెకండ్ హీరోయిన్ రోల్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కృతిశెట్టి రెమ్యునరేషన్ ప్రస్తుతం 60 లక్షల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.

కృతిశెట్టికి రాబోయే రోజుల్లో అయినా సక్సెస్ దక్కుతుందేమో చూడాల్సి ఉంది. నాగచైతన్య, కృతిశెట్టి రాబోయే రోజుల్లో కలిసి నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. కెరీర్ పరంగా ఎలాంటి పొరపాట్లు జరగకుండా కృతిశెట్తి, నాగచైతన్య జాగ్రత్తలు తీసుకుంటారేమో చూడాలి.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus