Nithya Menen: నిత్య ఫేస్‌లో ఎన్ని రకాల ఎమోజీల ఎక్స్‌ప్రెషన్లో.. చూశారా!

నందమూరి బాలకృష్ణలో ఏదో తెలియని మ్యాజిక్‌ ఉంది అంటుంటారు. అందుకే ఆయన్ను చూసి, ఆయన నటనను చూసి, అందం చూసి, నటన చూసి, యాక్టివ్‌నెస్‌ చూసి ఫిదా అయిపోతుంటారు కుర్రకారు. ఇందులో హీరోయిన్లు కూడా ఉంటారు. ‘జై బాలయ్య’ అంటూ మురిసిపోయిన హీరోయిన్లు ఎంతమందో. ఆయనలో మ్యాజిక్‌ అలాంటిది మరి. ఇటీవల అలాంటి ఫీలింగ్‌ నిత్య మేనన్‌కి కూడా కలిగింది. ఆమె మాటల్లో ఆ విషయం చెప్పలేదు కానీ, కళ్లలో చూస్తే తెలిసిపోతుంది.

‘ఆహా’లో ప్రసారమవుతున్న తెలగు ఇండియన్‌ ఐడల్‌కి సంబంధించి అన్‌స్టాపబుల్‌ 6 అనే ఎపిసోడ్ ఈ నెల 10న స్ట్రీమ్‌ అవ్వనుంది. దానికి సంబంధించిన ప్రోమోను టీమ్‌ ఇటీవల విడుదల చేసింది. బాలయ్య వన్‌ మ్యాన్‌ షోగా నడిచిన ఈ ఎపిసోడ్‌ ప్రోమోలో బాలయ్య ఎనర్జీ మామూలుగా లేదు. పాట పాడి, డ్యాన్స్‌ వేసి, జోకులేసి అదరగొట్టేశారు. అయితే బాలయ్య చేసిన ప్రతి పనికి పక్కనే కూర్చుని ఉన్న కథానాయిక నిత్య మేనన్‌ అయితే మురిసిపోయింది.

ఆమె కళ్లలో ఆ ఫీలింగ్‌ను చూడాలంటే కచ్చితంగా ఆ వీడియో చూడాల్సిందే. ప్రోమోలో ఓ కంటెస్టెంట్‌ పెళ్లి గురించి, మరో కంటెంస్టెంట్‌ వాయిస్‌ గురించి, ఇంకో కంటెస్టెంట్‌ రూపు గురించి జోకులేశారు. ఈ క్రమంలో నిత్య మేనన్‌ తన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో వావ్‌ అనిపించింది. నందమూరి నాయక పాటకు బాలయ్య స్టేజ్‌ ఎక్కి స్టెప్పులేసేసరికి నిత్య రెండు బుగ్గల మీద చేతులు పెట్టి ఓ ఎమోజీ ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చింది అదిరిపోయింది అంతే.

తోక – మేక పద్యం చెప్పినప్పుడు అయితే ఆశ్చర్యపోయే ఎమోజీ లాంటి ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చింది. ఇక ఆఖరున బాలయ్యను సర్‌ప్రైజ్‌ ఇద్దామని జడ్జిలు తమన్‌, కార్తిక్‌, ఉషా ఉతుప్‌, నిత్య మేనన్‌ బాలయ్యను స్టేజీ మీదకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బాలయ్య ‘ఆలీ బాబా 40 దొంగల్లా నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నారు’ అంటూ జోకేశారు. దానికి నిత్య పెద్ద నవ్వు నవ్వేసింది. అసలు తెలుపు రంగు డ్రెస్‌లో మెరిసిపోతున్న నిత్య.. ఆ నవ్వులతో మరింత వెలిగిపోయింది. కావాలంటే మీరే ఆ ప్రోమో చూడండి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus