Mahesh Babu: మాస్క్ పై మాస్క్ వేసుకోమంటున్న మహేష్.. ఏమైందంటే..?

గత కొన్ని రోజులుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో గతేడాది కంటే ఎక్కువ సంఖ్యలో కరోనా వైరస్ కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ రేపటినుండి పదిరోజుల పాటు లాక్ డౌన్ ను అమలు చేయనున్నారు. సైబరాబాద్ పోలీసులు సైతం ప్రజల్లో కరోనాపై అవగాహన కల్పించడానికి సినీ తారల ఫోటోలను వినియోగించుకుంటూ ఉండటం గమనార్హం. తాజాగా సైబరాబాద్ పోలీసులు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫోటోను వాడేశారు.

గతంలో ట్రాఫిక్ రూల్స్ కు సంబంధించి సినీ తారల ఫోటోలను ఉపయోగించిన పోలీసులు కరోనాపై అవగాహన కల్పించేందుకు మహేష్ ఫోటోతో సందేశం ఇచ్చారు. డెనిమ్ పైన డెనిమ్ వేయడం ఫ్యాషన్ ట్రెండ్ అని ఉన్న ఫోటోను మార్చి మాస్క్ పైన మాస్క్ పెట్టుకోవడం సేఫ్టీ ట్రెండ్ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మహేష్ ఫోటోతో పోలీసులు చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ ను చూసిన కొందరు నెటిజన్లు తప్పకుండా పాటిస్తాం

అని కామెంట్లు పెడుతుంటే మరి కొందరు మాత్రం రకరకాలుగా స్పందిస్తూ ఉండటం గమనార్హం. కొందరు నెటిజన్లు మాత్రం పోలీసుల క్రియేటివిటీని ప్రశంసిస్తున్నారు. భారత్ ను కరోనా మహమ్మారి చిగురుటాకులా వణికిస్తోంది. కరోనా పట్ల ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని పోలీసులు ప్రజలకు సూచనలు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.


Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus