నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ ‘వీరసింహారెడ్డి’ ‘భగవంత్ కేసరి’.. వంటి హిట్ సినిమాల తర్వాత బాలకృష్ణ హీరోగా రూపొందిన చిత్రం ‘డాకు మహారాజ్’. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమాకి బాబీ దర్శకుడు.మొదటి రోజు సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.దీంతో ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి హిట్ సినిమా పోటీగా ఉన్నప్పటికీ.. ‘డాకు మహారాజ్’ స్ట్రాంగ్ గా కలెక్ట్ చేస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి.
ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 10.74 cr |
సీడెడ్ | 9.45 cr |
ఉత్తరాంధ్ర | 6.72 cr |
ఈస్ట్ | 4.67 cr |
వెస్ట్ | 3.60 cr |
గుంటూరు | 6.41 cr |
కృష్ణా | 4.30 cr |
నెల్లూరు | 2.67 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 48.56 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 3.18 cr |
ఓవర్సీస్ | 7.02 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 58.76 cr (షేర్) |
‘డాకు మహారాజ్’ సినిమాకు రూ.83 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.83.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. 4 రోజుల్లో ఈ సినిమా రూ.58.76 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.27.74 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.