Kiara Advani: కియారా అడ్వాణీ ఫొటోలపై డబూ రత్నాని!

ఫ్యాషన్‌ వరల్డ్‌లో డబూ రత్నాని ఫొటో షూట్‌ అంటే ఓ క్రేజ్‌ ఉంది. ఆయన కెమెరాలో బందీ అవ్వాలని అనుకోని నాయిక ఉండదు అంటారు. అలా ఇప్పటివరకు చాలామంది నాయికలు ఆయన కెమెరా బందీ అయ్యి… ఆ ఫొటో బయటకు వచ్చి పాపులర్‌ అయ్యారు. వైరల్‌ అయ్యారు. కాంట్రవర్శీ కూడా అయ్యారు. అలా ప్రజెంట్ కాంట్రవర్శీగా కనిపిస్తున్న హీరోయిన్‌ కియారా అడ్వాణీ. ఇటీవల విడుదలైన ఆమె ఫొటోల గురించి వస్తున్న విమర్శలపై డబూ స్పందించారు.

డబూ రత్నాని క్యాలెండర్‌ అంటూ ఏటా కొంత మంది హీరోయిన్లను గ్లామరస్‌గా ఫొటోలు తీసి విడుదల చేస్తుంటారు. అలా ఈ ఏడాది కూడా కొంతమంది నాయికలు, హీరోల ఫొటోలతో క్యాలెండర్‌ తీసుకొచ్చారు. గత రెండేళ్లుగా ఆయన చేసిన క్యాలెండర్‌లో హాట్‌టాపిక్‌గా మారిన నాయిక కియారా అడ్వాణీ అనే చెప్పాలి. టాప్‌లెస్‌, బ్యాక్లెస్‌ పోజులిచ్చింది కియారా. దీంతో నెటిజన్ల కామెంట్లతో విరుచుకుపడ్డారు. దీనిపై డబూ మాట్లాడుతూ అసభ్యత ఫొటోలో కాదు… ఆలోచనలో ఉంది అన్నారు.

నా క్యాలెండర్‌ ఫొటోషూట్‌పై చేస్తున్న కామెంట్లను చదివాను. కొంతమంది ఊహించినట్లు అందులో నిజం లేదు. బ్లాక్‌ అండ్‌ వైట్ లుక్‌లో వైవిధ్యంగా ఉండాలని అలా షూట్‌ చేశా. అంతే కానీ కియారా అడ్వాణీని టాప్‌లెస్‌గా చూపించలేదు అంటూ వివరణ ఇచ్చారు డబూ రత్నాని. అంతేకాదు అసభ్యత ఫొటోలో లేదు, అలా చూసేవారిలో ఉంది. అయినా దీని గురించి మాట్లాడకపోవడమే మంచిది అని అన్నారు. ఆయన అంత క్లారిటీగా చెప్పినా ఇంకా డౌట్స్‌ ఉంటే ఏం చేయలేం.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus