Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Reviews » Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • April 10, 2026 / 06:51 AM ISTByFilmy Focus Desk
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • అడివి శేష్‌ (Hero)
  • మృణాల్ ఠాకూర్ (Heroine)
  • అనురాగ్ క‌శ్య‌ప్‌, జైన్ మేరీ ఖాన్‌, ప్ర‌కాష్ రాజ్‌, సునీల్‌, అతుల్ కుల‌క‌ర్ణి త‌దితరులు (Cast)
  • షానీల్ డియో (Director)
  • సుప్రియ యార్ల‌గ‌డ్డ‌ (Producer)
  • భీమ్స్ (పాట‌లు) గ్యానీ (బీజీఎమ్‌) (Music)
  • ధ‌నుష్ భాస్క‌ర్‌ (Cinematography)
  • కోదాటి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ (Editor)
  • Release Date : 10 ఏప్రిల్ 2026
  • ఎస్‌.ఎస్ క్రియేష‌న్స్‌ (Banner)

టాలీవుడ్‌లో వైవిధ్య‌త‌కు, కొత్త‌ద‌నానికి చిరునామాగా నిలుస్తుంటాయి అడివిశేష్ సినిమాలు. ట్రెండ్‌, ఇమేజ్ ప‌ట్టింపుల‌తో సంబంధం లేకుండా విభిన్న‌మైన క‌థాంశాల‌ను ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంటాడు. ఆ పంథానే అత‌డికి వ‌రుస‌గా విజ‌యాల‌ను తెచ్చిపెడుతోంది. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ త‌ర్వాత డెకాయిట్ (Dacoit) మూవీతో అడివిశేష్ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాకు షానీల్ డియో ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఎస్ ఎస్‌. క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సుప్రియ యార్ల‌గ‌డ్డ ఈ సినిమాను నిర్మించింది. రిలీజ్‌కు ముందు టీజ‌ర్‌, ట్రైల‌ర్స్‌తో అభిమానుల్లో ఆస‌క్తిని రేకెత్తించిన డెకాయిట్ మూవీ ఎలా ఉంది? ఈ సినిమాతో అడివిశేష్‌కు మ‌రో హిట్ ద‌క్కిందా? కొత్త ద‌ర్శ‌కుడు షానీల్ డియో డెకాయిట్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడా? లేదా అంటే?

Dacoit Movie Review

Dacoit Movie Review and Rating

క‌థ‌: హ‌రిదాస్ అలియాస్ హ‌రి (అడివిశేష్‌), స‌ర‌స్వ‌తి (మృణాల్ ఠాకూర్‌) ప్రాణంగా ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకోవాల‌ని క‌ల‌లు కంటారు. ఓ గొడ‌వ‌లో స‌ర‌స్వ‌తి అన్న‌య్య‌ను హ‌రి చంపేస్తాడు. హ‌రికి వ్య‌తిరేకంగా పోలీసుల ముందు సాక్ష్యం చెబుతుంది స‌ర‌స్వ‌తి. ప్రియురాలి త‌ప్పుడు సాక్ష్యం కార‌ణంగా ప‌ద‌మూడేళ్లు జైలులో మ‌గ్గిపోతాడు . స‌ర‌స్వ‌తిపై రివేంజ్ తీర్చుకోవ‌డానికి జైలు నుంచి త‌ప్పించుకుంటాడు హ‌రి. స‌ర‌స్వ‌తి భ‌ర్త గుండెజ‌బ్బుతో బాధ‌ప‌డుతున్నాడ‌ని, ఆప‌రేష‌న్‌కు డ‌బ్బులు అవ‌స‌ర‌మ‌ని హ‌రికి తెలుస్తుంది. స‌ర‌స్వ‌తి భ‌ర్త‌కు ట్రీట్‌మెంట్ ఇస్తున్న అదే హాస్పిట‌ల్ నుంచి పెద్ద మొత్తంలో డ‌బ్బు కొట్టేయాల‌ని ప్లాన్ వేస్తాడు హ‌రి.

ఈ క్రైమ్‌లో కావాల‌నే స‌ర‌స్వ‌తిని పార్ట్‌న‌ర్‌గా సెలెక్ట్ చేసుకుంటాడు. డ‌బ్బు కోసం హ‌రితో క‌లిసి దొంగ‌త‌నం చేయ‌డానికి స‌ర‌స్వ‌తి ఒప్పుకుంటుంది. డ‌బ్బు దొంగ‌త‌నం చేసి స‌ర‌స్వ‌తిని పోలీసులు ముందు ఇరికించి తాను ఎస్కేప్ కావాల‌ని హ‌రి అనుకుంటాడు. అత‌డి ప్లాన్ వ‌ర్క‌వుట్ అయ్యిందా? ప‌్రాణంగా ప్రేమించిన స‌ర‌స్వ‌తిపై అత‌డు ప్ర‌తీకారం తీర్చుకున్నాడా? స‌ర‌స్వ‌తి గురించి హ‌రికి తెలిసిన షాకింగ్ నిజం ఏమిటి? హ‌రికి వ్య‌తిరేకంగా స‌ర‌స్వ‌తి ఎందుకు త‌ప్పుడు సాక్ష్యం చెప్పింది? స‌ర‌స్వ‌తి ప్రేమ కోసం హ‌రి ఎలాంటి త్యాగానికి సిద్ధ‌ప‌డ్డాడు? వారి లైఫ్‌లోకి పోలీస్ ఆఫీస‌ర్ స్వామి (అనురాగ్ క‌శ్య‌ప్‌), మ‌ల్లి (కామాక్షి భాస్క‌ర్ల‌) ఎలా వ‌చ్చారు అన్న‌దే డెకాయిట్ మూవీ క‌థ‌.

Dacoit Movie Review and Rating

న‌టీన‌టుల ప‌నితీరు: డెకాయిట్‌కు (Dacoit) అడివిశేష్ వ‌న్ మెన్ షోగా నిలిచాడు. హీరోగా ఎక్కువ‌గా క్లాస్ పాత్ర‌లు చేసిన అడివిశేష్ ఇందులో మాస్ రోల్‌లో మెప్పించాడు. మ్యాన‌రిజ‌మ్స్‌, బాడీలాంగ్వేజ్ కొత్త‌గా ఉన్నాయి. హ‌రి పాత్ర కోసం మ‌ద‌న‌ప‌ల్లి యాస‌ కూడా నేర్చుకున్నాడు. ఈ సినిమా కోసం అత‌డు పెట్టిన ఎఫ‌ర్ట్స్ ప్ర‌తి సీన్‌లో క‌నిపిస్తాయి. స‌ర‌స్వ‌తి పాత్ర‌కు మృణాల్ ప‌ర్‌ఫెక్ట్ యాప్ట్‌గా నిలిచింది. ఎమోష‌న‌ల్ సీన్స్‌లో అడివిశేష్‌తో పోటీప‌డింది. ప్రియురాలిగా, భార్య‌గా, త‌ల్లిగా మ‌ల్టీపుల్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో చ‌క్క‌టి వేరియేష‌న్స్ చూపించింది. వీరిద్ద‌రు మిన‌హా మిగిలిన పాత్ర‌ల‌కు సినిమాలో పెద్ద‌గా స్కోప్ లేదు. అనురాగ్ క‌శ్య‌ప్‌, ప్ర‌కాష్ రాజ్‌, సునీల్‌, జైన్ మేరీ ఖాన్ లాంటి ప్ర‌తిభావంతుల‌ను స‌రిగ్గా వాడుకోలేదు.

Dacoit Movie Review and Rating

సాంకేతిక వ‌ర్గం ప‌నితీరు: టెక్నిక‌ల్‌గా మాత్రం డెకాయిట్ బ్రిలియంట్ మూవీ. హీరోగానే కాకుండా రైట‌ర్‌గా కూడా అడ‌విశేష్ ఆక‌ట్టుకున్నాడు. డైరెక్ట‌ర్ షానీల్ డియోతో క‌లిసి ఈ సినిమాకు క‌థ‌ను అందించాడు. రాయ‌ల‌సీమ యాస‌లో అబ్బూరి ర‌వి డైలాగ్స్ నాచుర‌ల్‌గా ఉన్నాయి. భీమ్స్ పాట‌ల్లో సోసోగా ఉన్నా గ్యానీ బీజీఎమ్ మాత్రం అదిరిపోయింది. క‌థ‌లోని ఫీల్‌ను చాలా సార్లు బీజీఎమ్ ఎలివేట్ చేసింది. ధ‌నుష్ భాస్క‌ర్ సినిమాటోగ్ర‌ఫీ రిచ్ ఫీల్‌ను క‌లిగించింది. ఈ సినిమాకు నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ కూడా ఓ హీరోగా నిలిచింది. భారీ బ‌డ్జెట్ సినిమాల లెవెల్‌లో మేకింగ్ వాల్యూస్ ఉన్నాయి.

Dacoit Movie Review and Rating

విశ్లేష‌ణ‌: సాధార‌ణంగా వెండితెర ప్రేమ‌క‌థ‌ల‌న్నీ ఒకే ఫార్మెట్‌లో సాగుతాయి. త‌మ‌కు ఎదురైన క‌ష్టాల‌న్నింటిని దాటుకొని చివ‌ర‌కు హీరోహీరోయిన్లు క‌లుసుకోవ‌డంతోనే క‌థ సుఖాంతం అవుతుంది. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి నేటి వ‌ర‌కు ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు టాలీవుడ్ రైట‌ర్లు, డైరెక్ట‌ర్లు ఈ రొటీన్ టెంప్లేట్‌ స్టోరీస్‌కు భిన్నంగా అడివిశేష్ చేసిన ప్ర‌య‌త్న‌మే డెకాయిట్‌. ప్రేమ‌క‌థ‌లంటే నాలుగు డ్యూయెట్లు, రొమాంటిక్ సీన్లు, హ్యాపీ ఎండింగ్‌ ఉండాల‌నే రూల్స్ మొత్తాన్ని ఈ సినిమాతో తిర‌గ‌రాశారు. నిజ‌మైన ప్రేమ ఎప్పుడూ ప్ర‌తీకారాన్ని కోరుకోదు…ఎలాంటి త్యాగానికి అయినా సిద్ధ‌ప‌డుతుంద‌నే అంశాన్ని క్రైమ్ ఎలిమెంట్‌, రివేంజ్ డ్రామాను జోడించి బ్యూటీఫుల్ ఎమోష‌న‌ల్ ల‌వ్‌స్టోరీగా ఈ సినిమాను తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు షానిల్ డియో.

జైలులో ఖైదీగా అడివిశేష్ ప‌రిచ‌య‌మ‌య్యే సీన్‌తోనే డెకాయిట్ ఆస‌క్తిక‌రంగా మొద‌ల‌వుతుంది. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌తో హ‌రి, స‌ర‌స్వ‌తి ప్రేమ‌క‌థ‌ను చూపించారు. కులాల అంత‌రాల‌తో రెట్రో స్టైల్‌లో నాచుర‌ల్‌గా ఈ ల‌వ్‌స్టోరీని ప్ర‌జెంట్ చేయ‌డం బాగుంది. హ‌రి జైలు నుంచి త‌ప్పించుకున్న సీన్ నుంచి సినిమా క్రైమ్ జాన‌ర్‌లోకి షిప్ట్ అవుతుంది.

క‌రోనా టైమ్‌లో కొవిడ్ ట్రీట్‌మెంట్ పేరుతో హాస్పిట‌ల్స్ జ‌నాల నుంచి ఎలా దోచుకున్నాయ‌నే పాయింట్‌తో క్రైమ్ ఎపిసోడ్‌ను అడివిశేష్, షానీల్ డియో ఆస‌క్తిక‌రంగా రాసుకున్నారు. ఈ పాయింట్ కొత్త‌గా ఉంది. స‌ర‌స్వ‌తిని మోసం చేయాల‌ని హ‌రి అనుకోవ‌డం….అత‌డిని ప‌ట్టుకోవ‌డానికి పోలీస్ ఆఫీస‌ర్ల‌తో పాటు ప్ర‌కాష్ రాజ్ మ‌నుషులు వేసే ఎత్తుల‌తో థ్రిల్లింగ్‌గా ఫ‌స్ట్ హాఫ్ సాగుతుంది. ఇంట‌ర్వెల్ హై అనే ఫీల్ ఇవ్వ‌క‌పోయినా ఒకే అనిపిస్తుంది.

డెకాయిట్ (Dacoit) సెకండాఫ్ కంప్లీట్ ఎమోష‌న‌ల్‌గా సాగుతుంది. మృణాల్ పాత్ర‌కు సంబంధించి వ‌చ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. ఫ‌స్ట్ హాఫ్‌లోని ప్ర‌శ్న‌ల్నింటికి సెకండాఫ్‌లో స‌మాధాన‌మిస్తూ రోల‌ర్ కోస్ట‌ర్ రైడ్‌లా సినిమా సాగుతుంది. క్లైమాక్స్ ఆడియెన్స్ ఏ మాత్రం గెస్ చేయ‌లేద‌ని విధంగా ఎమోష‌న‌ల్‌గా ఉంటుంది. ఇలాంటి క్లైమాక్స్‌తో సినిమా చేయ‌డ‌మంటే కొంత రిస్క్ అనే చెప్పాలి. గ‌తంలో ఈ విధ‌మైన ఎండింగ్‌ వ‌చ్చిన సినిమాలు ఏవి ఆడ‌లేదు. కానీ క‌మ‌ర్షియ‌ల్ హంగులు, సెంటిమెంట్ల గురించి ఆలోచించ‌కుండా నిజాయితీగా తాము ఏం చెప్పాల‌ని అనుకున్నారో అదే చూపించారు మేక‌ర్స్‌.

డెకాయిట్ కాన్సెప్ట్ కొత్త‌గా ఉన్నా స్క్రీన్‌ప్లే మాత్రం చాలా ప్రెడిక్ట‌బుల్‌గా సాగుతుంది. హాస్పిట‌ల్ నుంచి డ‌బ్బులు కొట్టేసే సీన్స్‌లో థ్రిల్ ఆశించిన స్థాయిలో వ‌ర్క‌వుట్ కాలేదు. ఒకే త‌ర‌హాలో మూడుసార్లు దొంగ‌త‌నం చేయ‌డం లాజిక్‌లెస్‌గా అనిపిస్తుంది. క్రైమ్ థ్రిల్ల‌ర్‌సినిమాల్లో ఉండే వేగం ఇందులో లేదు. క్లైమాక్స్ ఈ సినిమాకు ప్ల‌స్‌తో పాటు మైన‌స్‌గా నిలిచింది. క‌మ‌ర్షియ‌ల్ ఆడియెన్స్ ఇలాంటి క్లైమాక్స్‌కు క‌నెక్ట్ కావ‌డం కొంత క‌ష్ట‌మే.

Dacoit Movie Review and Rating

ఫోక‌స్ పాయింట్‌: డెకాయిట్ జెన్యూన్ ల‌వ్‌స్టోరీ

రేటింగ్ : 2.5/5

Click Here To Read in ENGLISH

 

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adivi Sesh
  • #Anurag Kashyap
  • #Dacoit Movie
  • #Mrunal Thaku

Reviews

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

21 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

23 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

1 day ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

2 days ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

2 days ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version