Bheemla Nayak: ‘భీమ్లా నాయక్‌’ టీజర్‌ మంట మాన్చడానికి రెడీ అవుతున్నారు!

‘మల్టీస్టారర్‌ సినిమాను సోలో స్టారర్‌ చేసేస్తున్నారా?’… ‘భీమ్లానాయక్‌’ వీడియో గ్లింప్స్‌ వచ్చినప్పటి నుండి, ఇంకా చెప్పాలంటే రావడానికి రెండు, మూడు రోజుల ముందు నుండి ఇదే మాట వినిపిస్తోంది. సినిమాలో రానా పాత్రను హైలైట్‌ చేయడం లేదని, కేవలం పవన్‌ కల్యాణ్‌ను మాత్రమే హైలైట్‌ చేస్తున్నారని ఆ మాటల సారాంశం. అందుకు తగ్గట్టే ‘భీమ్లా నాయక్‌’ గ్లింప్స్‌లో రానా ఒక్క ఫ్రేమ్‌లో కూడా కనపడలేదు. దీంతో రానా అభిమానులు, సినిమా ప్రేక్షకులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పరిస్థితిని చక్కదిద్దే పనిలో సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ టీమ్‌ ఉందట.

నిజానికి ‘భీమ్లా నాయక్‌’ వీడియో రిలీజ్‌ అయిన రోజే…. నిర్మాత అయిన నాగవంశీ ఓ నెటిజన్‌ ట్వీట్‌కి రిప్లై ఇచ్చారు. ‘అప్పుడే నిర్ణయానికి వచ్చేయొద్దు… అన్నీ ఓ లెక్క ప్రకారం జరుగుతాయి’ అని ఆ ట్వీట్‌లో రాసుకొచ్చారు. అందుకు తగ్గట్టే రానా పాత్ర అయిన డేనియల్‌ శేఖర్‌ పాత్రకు సంబంధించి ఓ వీడియో సిద్ధమవుతోందట. త్వరలోనే ఆ వీడియోను విడుదల చేస్తారని టాలీవుడ్‌ వర్గాల భోగట్టా. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే వారంలో ఆ వీడియో వస్తుందట.

మలయాళ సూపర్‌ హిట్‌ ‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’కు ‘భీమ్లా నాయక్‌’ రీమేక్‌గా వస్తున్న విషయం తెలిసిందే. మాతృకలో ఇద్దరు హీరోల పేర్లు కలసి వచ్చేలా టైటిల్‌ పెట్టారు. ఇక్కడ చూస్తే ఒక హీరో పేరే వచ్చేలా చూసుకున్నారు. దీంతో ఇది ‘మల్టీ స్టారర్‌ కాదంటూ’ చర్చలు మొదలయ్యాయి. అలాంటి చర్చలు, అభిమానులను కూల్‌ చేసే ప్రయత్నంలోనే భాగంగా ఈ ఆయింట్‌మెంట్‌ రెడీ అవుతోందనే టాక్‌ సోషల్‌ మీడియాలో వినిపిస్తోంది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus