Captain Miller: విడుదలకు సిద్ధమైన కెప్టెన్ మిల్లర్!

  • January 12, 2024 / 05:59 PM IST

తమిళ్ హీరో ధనుష్ నుంచి వస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీ కెప్టెన్ మిల్లర్. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమా నేడు తమిళ భాషలలో విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా నేడే విడుదల కావాల్సి ఉండగా థియేటర్ల సమస్య కారణంగా విడుదల వాయిదా పడింది. ఈ సినిమా తెలుగు విడుదల హక్కులను ఏషియన్ వారితో పాటు సురేష్ ప్రొడక్షన్ వారు కొనుగోలు చేశారు.

అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాని తెలుగులో కూడా ఇదే రోజే విడుదల చేయాలని భావించారు. అయితే ఇప్పటికే తెలుగులో గుంటూరు కారం సినిమాతో పాటు హనుమాన్ సినిమా కూడా విడుదల అయింది అదేవిధంగా మరో రెండు సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తెలుగులోనే ఏకంగా నాలుగు సినిమాలు విడుదలవుతున్నటువంటి తరుణంలో థియేటర్ల సమస్య అధికంగా ఉంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా తెలుగు విడుదలను వాయిదా వేశారు. ఇలా సంక్రాంతి పండుగకు వెనకడుగు వేసినటువంటి కెప్టెన్ మిల్లర్ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఇదే విషయాన్ని ఏషియన్ సురేష్ ప్రొడక్షన్ వారు అధికారక పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సినిమా తెలుగులో జనవరి 25వ తేదీ విడుదల కాబోతున్నట్లు తెలియజేశారు.

ఇక ఈ సినిమాలో (Captain Miller) ధనుష్ హీరోగా నటించగా శివ రాజ్ కుమార్, సందీప్ కిషన్ ముఖ్య పాత్రలు చేస్తుంటే.. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించారు. మరి తమిళంలో సక్సెస్ అయినటువంటి ఈ సినిమా తెలుగులో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus