‘దర్బార్’ 2 డేస్ కలెక్షన్స్..!

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్షన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘దర్బార్’. జనవరి 10న విడుదలైన ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. మొదటి రోజు డీసెంట్ కలెక్షన్లను రాబట్టిన ఈ చిత్రం.. రెండో రోజున ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఎక్కువ థియేటర్లు ఉన్నప్పటికీ ఈ చిత్రం క్యాష్ చేసుకోలేకపోయింది.

ఇక ఈ చిత్రం 2 రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 2.81 cr
సీడెడ్ 0.79 cr
ఉత్తరాంధ్ర 0.58 cr
ఈస్ట్ 0.39 cr
వెస్ట్ 0.26 cr
కృష్ణా 0.33 cr
గుంటూరు 0.50 cr
నెల్లూరు 0.24 cr
ఏపీ + తెలంగాణ 5.9 cr(share)

‘దర్బార్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 14.2 కోట్ల బిజినెస్ జరిగింది. రెండు రోజు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 5.9 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 8.5 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే ఈరోజు నుండీ ఈ చిత్రానికి అసలు పరీక్ష మొదలు కానుంది. ఎందుకంటే ఈరోజు మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం విడుదలయ్యి హిట్ టాక్ ను సంపాదించుకుంది. ఇక రేపు కూడా ‘అల వైకుంఠపురములో’ చిత్రం విడుదల కాబోతుంది. మరి ఆ పోటీని తట్టుకుని ‘దర్బార్’ ఎంత వరకూ రాణిస్తుందో చూడాలి.

Click Here to Read Darbar Movie Review

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
దర్బార్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus