Darling Collections: 15 ఏళ్ళ ప్రభాస్ ‘డార్లింగ్’ కలెక్షన్స్ ఇవే..!

‘ఛత్రపతి’ (Chatrapathi) తర్వాత సరైన సక్సెస్ లేని ప్రభాస్ (Prabhas) ఎ.కరుణాకరన్ (A. Karunakaran)  డైరెక్షన్లో ఓ న్యూ ఏజ్(అప్పటికి) లవ్ స్టోరీ చేశాడు.’శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర’ బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ (B. V. S. N. Prasad) ఈ చిత్రాన్ని నిర్మించారు. అప్పటికి సక్సెస్ లో ఉన్న కాజల్ (Kajal Aggarwal) హీరోయిన్. 2010 ఏప్రిల్ 23న పెద్దగా అంచనాలు లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. మొదటి షోతోనే సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ కొత్తగా ఉంటాయి. కామెడీ టైమింగ్ కూడా ఇంప్రూవ్ అయ్యింది.

Darling Collections:

ఇంటర్వెల్ ను, క్లైమాక్స్ ని దర్శకుడు కరుణాకరణ్ డీల్ చేసిన విధానం కూడా అందరికీ నచ్చింది. దీంతో ‘డార్లింగ్’ (Darling) బాక్సాఫీస్ వద్ద కూడా డీసెంట్ సక్సెస్ అందుకుంది.నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 15 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 6.3 cr
సీడెడ్ 2.21 cr
ఉత్తరాంధ్ర 3.65 cr
ఈస్ట్ 2.14 cr
వెస్ట్ 2.65 cr
గుంటూరు 2.06 cr
కృష్ణా 2.41 cr
నెల్లూరు 1.02 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 22.44 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +  ఓవర్సీస్ 0.47 cr
టోటల్ వరల్డ్ వైడ్ 22.91 cr

‘డార్లింగ్’ (Darling) చిత్రం రూ.16.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం 22.91 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్స్ కు రూ.6.11 కోట్ల లాభాలు అందించి సూపర్ హిట్ గా నిలిచింది. ‘సింహా'(Simha) వంటి మాస్ సినిమాతో పోటీపడి మరీ ‘డార్లింగ్’ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించడం అనేది విశేషంగా చెప్పుకోవాలి.

 ‘ఫౌజీ’ నుండి ఇమాన్విని తీసేయాలంటూ నెటిజన్ల ఆగ్రహం!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus