Dasara Trailer: మెంటల్ మాస్ ఎలిమెంట్స్, గుండెలు పిండేసే ఎమోషన్స్ హైలెట్‌గా నాని ‘దసరా’..!

నేచురల్ స్టార్ నాని కెరీర్‌లో ఫస్ట్ పాన్ ఇండియా స్థాయిలో ‘దసరా’ మూవీతో పెద్ద అటెంప్ట్ చేస్తున్నాడు.. సినిమాను తన భుజాల మీద వేసుకుని అన్ని భాషల్లోనూ ప్రమోట్ చేస్తున్నాడు.. మూవీ రిజల్ట్ మీద నాని చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు.. ఇప్పటివరకు రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ సినిమా మీద మంచి అంచనాలు పెంచేసింది.. రీసెంట్‌గా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.. నాని, కీర్తి సురేష్ జంటగా.. శ్రీకాంత్ ఓదెలను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మించిన పక్కా మాస్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘దసరా’..

‘నేను లోకల్’ తర్వాత నాని, కీర్తి కలిసి నటిస్తున్న సినిమా ఇది. అలాగే నాని కెరీర్‌లో రూపొందుతున్న ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం కూడా ఇదే కావడం విశేషం.. మార్చి 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మంగళవారం ఐదు భాషల్లో ‘దసరా’ ట్రైలర్ రిలీజ్ చేశారు.. మూవీ నాని వన్ మెన్ షో అనేది ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.. సింగరేణి బొగ్గు కార్మికుల జీవితం ఆధారంగా ఆసక్తికర మలుపులతో యాక్షన్ రస్టిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘దసరా’ కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనిపిస్తోంది..

పేరుకి తగ్గట్టే నాని నేచురల్ పర్ఫ్మార్మెన్స్ పాజిటివ్ బజ్ తెచ్చి పెట్టింది.. కంప్లీట్ మాస్ మేకోవర్, తెలంగాణ స్లాంగ్, యాటిట్యూడ్, మేనరిజమ్స్.. ఇక ఓపెనింగ్‌లోనే కీర్తి సురేష్.. వెన్నెల పలికిన మాటలు అదిరిపోయాయి.. దీంతో ఆమె క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో ఊహించుకోవచ్చు.. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి..

స్నేహం, ప్రేమ, ఎమోషన్స్ హైలెట్‌గా రూపొందిన ‘దసరా’ లో నాని, కీర్తిల నటన ప్రేక్షకుల మనసుల్ని దోచుకోవడంతో పాటు భావోద్వేగానికి గురి చేస్తుందని చెప్తున్నారు.. పాపులర్ మలయాళం యాక్టర్ షైన్ టామ్ చాకో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. ‘డైలాగ్ కింగ్’ సాయి కుమార్, సముద్రఖని, జరీనా వాహబ్, దీక్షిత్ శెట్టి తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతమందించారు..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus