విప్లవ చిత్రాల దర్శకుడు ధవళ సత్యం తన చిత్రాల ద్వారా కమ్యూనిజం భావాలను చూపించాడు. ఎర్ర మల్లెలు, భీముడు, యువతరం కదిలింది, జాతర, చైతన్య రథం, నేను సైతం వంటి చిత్రాలను తీశారు. నాటక రంగంతో పరిచయమున్న ధవళ సత్యం, దాసరి నారాయణ రావు గారి శిష్యుడు. తాజాగా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తాను డైరెక్టర్ గా మొదట సినిమా చేయాలని అనుకున్నపుడు చిరంజీవినే హీరోగా తీసుకోవాలి అని డిసైడ్ అయ్యారట సత్యం.
అయితే సత్యం గారు ఆయన గురువు దాసరి వద్దకు వెళ్లి చెబితే మొదటి సినిమా అందరూ కొత్తవాళ్ళైతే ఎలా, హీరోగా మన దగ్గర డేట్స్ ఉన్న హీరో ని చూద్దాం అని చంద్రమోహన్ ను తీసుకోమని సలహా ఇచ్చారట. అయితే అప్పటికే శివరంజని సినిమా ఆడిషన్ కోసం వచ్చిన చిరు నటన చూసిన సత్యం ఆ రోజే తనతో హీరోగా సినిమా చేయాలని అనుకున్నారట.
ఇక ధవళ సత్యం తన సినిమా ప్రస్థానంలో మైలురాయి వంటి సినిమా ‘జాతర’ చిరంజీవిని హీరోగా డిసైడ్ అయ్యారు. మిగిలిన చిత్ర బృందాన్ని ఒప్పించడానికి కష్టపడ్డానని కానీ చివరకు చిరంజీవినే హీరోగా సినిమా తీసానని ఆ సినిమా గురించి చెబుతారు సత్యం. ఇక ఆ సినిమా నేడు మంచి కమర్షియల్ హిట్ అయి రామ్ చరణ్ కెరీర్ లో ది బెస్ట్ గా నిలిచిన ‘రంగస్థలం’ సినిమా కథ ఒకటేనని చెప్పారు.
చిరంజీవి (Chiranjeevi) మంచి స్థాయికి వెళ్తాడని ఎపుడో తాను చెప్పానని అన్నారు. ఆ తరువాత చిరంజీవి మెగాస్టార్ గా ఎదగడానికి ఎంత కష్టపడ్డాడో తెలుసు. ఆయన ఇప్పుడికి 154 సినిమాలకు పైగా నటించారు. ఇప్పుడు టాలీవుడ్ లో ఎంతో మంది కొత్త హీరోలకు అదర్శంగా నిలిచారు.
రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!
గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?